త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్‌పై ట్రోల్స్‌..! గ‌తంలో చేసిన వ్యాఖ్యాల ఫ‌లిత‌మే..!

Mrunal Thakur | బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఓ మూవీలో న‌టిస్తుంది. పూజా హెగ్డేతో క‌లిసి క‌నిపించ‌నుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల‌వ‌గా.. మృణాల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

P

Entertainment | Published On Apr 15, 2026, 12.30 pm IST

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్‌పై ట్రోల్స్‌..! గ‌తంలో చేసిన వ్యాఖ్యాల ఫ‌లిత‌మే..!
Advertisement

Mrunal Thakur | బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్‌పై సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తాజాగా ఈ బ్యూటీ బాలీవుడ్‌లో ఓ మూవీలో న‌టిస్తుంది. పూజా హెగ్డేతో క‌లిసి క‌నిపించ‌నుంది. ఈ మూవీకి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల‌వ‌గా.. మృణాల్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సీతారామం బ్యూటీ తాజా చిత్రం “హై జవాని తో ఇష్క్ హోనా హై”లో వరుణ్ ధావన్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. ఈ నేప‌థ్యంలో విడుద‌లైన పోస్ట‌ర్‌, వీడియోలో మృణాల్ గ్లామ‌ర‌స్ పాత్ర‌ల్లో క‌నిపించ‌డంపై చ‌ర్చ‌కు కార‌ణ‌మైంది.

అయితే, ఈ పోస్ట‌ర్‌పై తెలుగు సినీ ప్రేక్ష‌కులు, సోష‌ల్ మీడియాలో ప‌లువురు నెటిజ‌న్లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్రెస్‌మీట్‌లో మృణాల్ చేసిన వ్యాఖ్య‌లు ఇందుకు ప్ర‌ధాన కార‌ణం. సీతారామం, హాయ్ నాన్న త‌దిత‌ర చిత్రాల్లో న‌టించిన త‌ర్వాత‌.. తాను తెలుగు సినిమాల ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాన‌ని.. త‌న‌కు న‌చ్చ‌ని పాత్ర‌ల‌ను తిర‌స్క‌రిస్తున్న‌ట్లు చెప్పిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే హిందీ సినిమాల్లో మాత్రం గ్లామరస్, కమర్షియ‌ల్ పాత్ర‌ల్లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంపై నెటిజ‌న్స్ ప్ర‌శ్నిస్తున్నారు. “తెలుగులో పాత్రల విషయంలో అంత జాగ్రత్తగా ఉండే మృణాల్.. హిందీలో మాత్రం ఎందుకు అలాంటి సినిమాలు చేస్తోంది? ప‌లువురు ఆగ్ర‌హిస్తున్నారు. మరికొందరు ఈ పోస్టర్‌కు “ఓల్డ్ కమర్షియల్ వైబ్ ఉంది” అంటూ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

అయితే, మరోవైపు, నటిగా మృణాల్ తనకు నచ్చిన పాత్రలు ఎంచుకునే హక్కు ఆమెకు ఉందని మ‌రికొంద‌రు అభిప్రాయం వ్య‌క్తం చేశారు. ఒక భాషలో ఒక విధమైన ఇమేజ్ ఉన్నందుకు, ఇతర భాషల్లో కూడా అదే విధంగా కొనసాగాల్సిన అవసరం లేదని పేర్కొంటున్నారు. మ‌రీ ఈ ట్రోల్స్‌పై మృణాల్ స్పందిస్తుందా? లేదా అన్ని వేచి చూడాల్సిందే. ఇదిలా ఉండ‌గా.. మృణాల్ ఇటీవ‌ల తెలుగులో డెకాయిట్ మూవీలో క‌నిపించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ప‌ర్వాలేద‌నిపించింది. ప్ర‌స్తుతం తెలుగులో అల్లు అర్జున్‌-అట్లీ కాంబోలో వ‌స్తున్న రాకా మూవీలో కీల‌క‌పాత్ర‌లో న‌టించ‌నుంది. హిందీలో పూజా మేరీ జాన్ మూవీలోనూ న‌టిస్తోంది.

Advertisement
Advertisement