త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ustaad Bhagat Singh | ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వ‌స్తున్న‌డు..! రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌..!

Ustaad Bhagat Singh | ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్ర‌క‌టించింది.

P

Entertainment | Published On Feb 4, 2026, 5.32 pm IST

Ustaad Bhagat Singh | ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ వ‌స్తున్న‌డు..! రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించిన మేక‌ర్స్‌..!
Advertisement

Ustaad Bhagat Singh | ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం రిలీజ్ డేట్‌ను చిత్రబృందం ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మార్చి 26న ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం మూవీ షూటింగ్ పూర్త‌య్యింది. ప్ర‌స్తుతం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ఫ‌స్ట్ సాంగ్ ‘దేఖ్‌లేంగే సాలా’ రిలీజ్ కాగా.. మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సాంగ్‌లో పవన్ కనిపించిన తీరు కట్టిపడేసింది. లుక్, ఎనర్జీ, స్టెప్పులు పరంగా వింటేజ్ పవర్‌స్టార్‌ను గుర్తుకు తెచ్చింది. హ‌రీశ్ శంక‌ర్, ప‌వ‌న్ క‌ల్యాణ్ కాంబోలో గ‌తంలో వ‌చ్చిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. తాజాగే ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో మ‌రోసారి అంత‌కు మించి సంచ‌నాల‌ను సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. శ్రీ‌లీల‌, రాశీఖ‌న్నా హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. పార్థిబ‌న్ కేఎస్ ర‌వికుమార్‌, ఎల్‌బీ శ్రీ‌రామ్‌, రావు రమేష్, రాంకీ, కేజీఎఫ్ అవినాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. న‌వీన్ యెర్నేని, ర‌వి శంక‌ర్ య‌ల‌మంచి నిర్మిస్తున్నారు.

Advertisement
Advertisement