త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్

King 100 | అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది.

S

Entertainment | Published On Nov 4, 2026, 4.23 pm IST

King 100 | కింగ్ 100లో టబు గ్లింప్స్
Advertisement

King 100 | త్రినేత్ర న్యూస్ : అక్కినేని నాగార్జున నటిస్తున్న 100వ చిత్రం ‘కింగ్ 100’ నుంచి సీనియర్ నటి టబు స్పెషల్ గ్లింప్స్ విడుదలయ్యాయి. ఈ సినిమాలో టబు కీలక పాత్రలో నటిస్తోంది. బుధవారం టబు పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ గ్లింప్స్‌ను నాగార్జున ఎక్స్‌లో ట్వీట్ చేశారు. నిన్నే పెళ్లాడ‌తా మూవీలో పండుగా ట‌బును ఎవ‌రూ మ‌రిచిపోలేర‌ని, తాజాగా మహంతి ఝాన్సీ రాణీగా ప్రేక్షకుల మ‌దిలో నిలిచిపోతుంద‌ని చెప్పారు. వీడియోలో ‘మనుషుల్లో రెండు రకాలు.. కష్టాన్ని నమ్మేవాళ్లు, అదృష్టాన్ని నమ్మేవాళ్లు. ‘మహంతి ఝాన్సీ రాణి అనే నేను’.. అంటూ ఆమె చెప్పే డైలాగ్‌ సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తోంది. రా. కార్తిక్‌ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 24న విడుద‌ల కానుంది.

Advertisement
Advertisement