Samantha | ఇదే నా సిక్స్ ప్యాక్.. బేబీ బంప్ ఫొటో షేర్ చేసిన సమంత
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) తల్లికాబోతున్న విషయం తెలిసిందే. తన ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన సామ్ తొలిసారి బేబీ బంప్ (baby bump) ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.
Entertainment | Published On Jul 1, 2026, 11.10 am IST
Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha Ruth Prabhu) తల్లికాబోతున్న విషయం తెలిసిందే. ఇటీవలే జరిగిన మా ఇంటి బంగారం సక్సెస్ మీట్‌లో సామ్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. కొన్ని రోజులు మెటర్నటీ లీవ్ తీసుకోనున్నట్లు ప్రకటించారు. ఇక తన ప్రెగ్నెన్సీని కన్ఫమ్ చేసిన సామ్ తొలిసారి బేబీ బంప్ (baby bump) ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఇదే నా సిక్స్ ప్యాక్ అంటూ ఫన్నీ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్టు తెగ వైరల్ అవుతోంది.
సమంత నటించిన మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram) మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం మూవీ సక్సెస్‌తో పాటూ ప్రెగ్నెన్సీని సామ్ ఎంజాయ్ చేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరును సామ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే. సామ్ ప్రెగ్నెంట్ కావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లను, కష్టాలను ఎదుర్కొన్న సామ్.. ఇప్పుడు సంతోషంగా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఈ ఏడాది చివర్లో సామ్ బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలుస్తోంది.

Also Read..
ఏఐ వృద్ధి.. భారత ఐటీ రంగంపై పెను ప్రభావం.. జేపీమోర్గాన్ హెచ్చరిక..
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | కాక్టెయిల్ 2 వర్సెస్ మా ఇంటి బంగారం – సమంత సినిమాకు లాభాలు – రష్మిక సినిమాకు నష్టాలు
జూన్ 26, 2026

Samantha | నా పనైపోయిందన్నారు – హీరోయిన్గా రీఎంట్రీ కష్టమని విమర్శించారు – సమంత కామెంట్స్
జూన్ 25, 2026

Samantha | చిరు లీక్స్ – సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
జూన్ 23, 2026
తాజావార్తలు
- ●MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ
- ●Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత తరహాలోనే పనిచేస్తుంది..
- ●Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..
- ●Delhi Fire | భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!
- ●TGSRTC | ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. ఆ రూట్లో పెరిగిన బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు..
- ●Amazon | ప్రైమ్ వీడియోస్‌లో యాడ్స్ వివాదం.. చట్టపరమైన చిక్కుల్లో అమెజాన్

MP Mallu Ravi | రాముని బాటలో రేవంత్.. రావణాసురుడి బాటలో బీజేపీ

Telegram | టెలిగ్రామ్‌లో మళ్లీ మెసేజ్ ఎడిట్ ఫీచర్.. పాత తరహాలోనే పనిచేస్తుంది..

Google | గూగుల్ నుంచి నానో బనానా 2 లైట్ ఇమేజ్ మోడల్.. 4 సెకన్లలో ఏఐ ఇమేజ్ను క్రియేట్ చేస్తుంది..

Delhi Fire | భారీ అగ్నిప్రమాదం.. కాలిబూడిదైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. రూ.లక్షల్లో నష్టం..!



