Virosh Wedding | విరోష్ వెడ్డింగ్.. బయటకు వచ్చిన తొలి ఫొటో
Virosh Wedding | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో విరోష్ (Virosh Wedding) సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం బయటకు వచ్చింది.
Entertainment | Published On Feb 26, 2026, 11.05 am IST
Virosh Wedding | విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna) వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లోని ఐటీసీ మెమోంటోస్ హోటల్‌లో వీరి వివాహం జరుగనుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్ వేడుకలు పూర్తయ్యాయి. అసలు పెళ్లి నేడే. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో విరోష్ (Virosh Wedding) సందడి చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం బయటకు వచ్చింది. ఆ ఫొటోలో.. విజయ్-రష్మిక ఇద్దరూ చేతులు పట్టుకుని కనిపించారు. ఆ ఫొటోలో రష్మిక సిల్వర్ కలర్ డిజైనర్ డ్రెస్‌లో మెరిసిపోతూ కనిపించారు. ఇక రౌడీబాయ్ సంప్రదాయ బ్లాక్ కుర్తా ధరించారు. ఇద్దరూ ఒకరి చేయి ఒకరు పట్టుకుని వెళ్తూ కనిపించారు. ఈ ఫొటో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
రెండు పద్దతుల్లో..
హిందూ సంప్రదాయ పద్దతిలో ఉదయం 10.10 నిమిషాలకు విజయ్, రష్మిక పెళ్లి జరుగనుంది. ఆ తర్వాత సాయంత్రం 4.10 నిమిషాలకు కొడవ ఆచారం ప్రకారం మరోసారి వీరిద్దరు వివాహ వేడుక జరుగనుంది. పెళ్లి ఫొటోలను సాయంత్రం రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
బుధవారం రాత్రి సంగీత్ వేడుక (Sangeet ceremony) జరిగింది. ఇందులో విజయ్, రష్మిక కలిసి డ్యాన్స్ చేశారు. గీతగోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లోని పాటలకు వీరిద్దరు కలిసి వేసిన స్టెప్పులు వేశారట. ఈ పాటలతో తమ లవ్‌జర్నీని మరోసారి వీరిద్దరు గుర్తుచేసుకున్నారట. పుష్ప 2 సాంగ్స్ సంగీత్ వేడుకకు ఫుల్ జోష్‌ను తెచ్చినట్లు సమాచారం.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rashmika Mandanna | హీరోయిన్ అందాన్ని పొగుడుతూ నోరుజారిన రష్మిక – బోల్డ్ కామెంట్స్ వైరల్
మే 18, 2026

Hardik Pandya | గర్ల్‌ఫ్రెండ్‌తో హార్దిక్ పాండ్యా రెండో పెళ్లి.. డేట్ కూడా ఫిక్స్..?
మే 16, 2026

Kriti Sanon | నేను నెపోటిజం బాధితురాలినే – బాలీవుడ్లో హీరోయిన్లపై వివక్ష ఎక్కువే – కృతి సనన్ కామెంట్స్
మే 10, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



