త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Rashmika Wedding | నో ఫోన్స్‌, నో సెలబ్రిటీ గెస్ట్స్‌.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌ధ్యే విజ‌య్‌-ర‌ష్మిక వివాహం..!

Vijay Rashmika Wedding | టాలీవుడ్ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే.

D

Entertainment | Published On Feb 17, 2026, 10.00 am IST

Vijay Rashmika Wedding | నో ఫోన్స్‌, నో సెలబ్రిటీ గెస్ట్స్‌.. ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌ధ్యే విజ‌య్‌-ర‌ష్మిక వివాహం..!
Advertisement

Vijay Rashmika Wedding | టాలీవుడ్ స్టార్స్ విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda), ర‌ష్మిక మంద‌న్న (Rashmika Mandanna) పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. ఫిబ్ర‌వ‌రి 26న వీరి వివాహం ఉద‌య్‌పూర్ (Udaipur) వేదిక‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు వార్త‌లు షికారు చేస్తున్నాయి. అయితే, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా వెలువ‌డ‌లేదు. ఇంత‌లో మ‌రో వార్త నెట్టింట ద‌ర్శ‌న‌మిచ్చింది. వేడుక‌కు హాజ‌ర‌య్యే అతిథులు ఎలాంటి ఫోన్ తీసుకురాకూడ‌ద‌ని కండిష‌న్ పెట్టారంట‌. అంతేకాదు, సినిమా ఇండ‌స్ట్రీకి సంబంధించి ఏ ఒక్క సెల‌బ్రిటీని కూడా ఈ పెళ్లికి ఆహ్వానించ‌లేద‌ని తెలిసింది.

ఈ మేర‌కు సంబంధిత వ‌ర్గాల‌ను ఉటంకిస్తూ జాతీయ మీడియాలో వ‌రుస క‌థ‌నాలు వ‌స్తున్నాయి. పెళ్లి చాలా ప్రైవేట్‌గా జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌ద‌రు వ‌ర్గాలు తెలిపాయి. ఇరు కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే వేడుక‌కు హాజ‌రుకానున్నార‌ట‌. పెళ్లి ఫొటోలు, వీడియోలు బ‌య‌ట‌కు రాకుండా విజ‌య్‌-ర‌ష్మిక జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిసింది. అందుకే ఈవెంట్‌లో నో ఫోన్ పాల‌సీని అమ‌లు చేసిన‌ట్లుగా సన్నిహిత వ‌ర్గాల ద్వారా తెలిసింది.

“ఫిబ్ర‌వ‌రి 24న పెళ్లి వేడుక‌లు ప్రారంభం కానున్నాయి. 26తో వేడుక‌లు ముగుస్తాయి. వివాహానికి చాలా త‌క్కువ మందిని ఇన్వైట్ చేశారు. ఫోన్‌లు అనుమ‌తి ఉండ‌దు. వెడ్డింగ్ ఈవెంట్‌ను చిత్రీక‌రించే టీమ్ కూడా నాన్ డిస్‌క్లోజ‌ర్ అగ్రిమెంట్‌పై స‌ంతకం చేసింది” అని స‌న్నిహిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఇక సాధార‌ణ సెల‌బ్రిటీల వివాహాల కంటే ఈ వెడ్డింగ్ చాలా స్పెష‌ల్‌. ఎందుకంటే ఈ వేడుక‌కు స్టార్ హీరోలు, హీరోయిన్‌లు, ఇండ‌స్ట్రీకి సంబంధించిన ఏ ఒక్క‌రినీ ఆహ్వానించ‌లేద‌ట‌. అతిథుల జాబితాలో కేవ‌లం కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితులు మాత్ర‌మే ఉండ‌టం విశేషం. దీన్ని బ‌ట్టే తెలుస్తోంది.. ర‌ష్మిక‌-విజ‌య్ జంట వారి పెళ్లిని ఎంత ప్రైవేట్‌గా చేస‌కుంటున్నార‌న్న‌ది. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కూ ఏ విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. పెళ్లి అనంత‌రం ఈ జంట అధికారికంగా ప్ర‌క‌టించే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

వెడ్డింగ్ కార్డు వైర‌ల్‌...

కాగా విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న‌ల వెడ్డింగ్ కార్డు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. కుటుంబ‌స‌భ్యుల స‌మ‌క్షంలోనే ఫిబ్ర‌వ‌రి 26న త‌మ పెళ్లి వేడుక నిరాడంబ‌రంగా జ‌రుగ‌నుంద‌ని ఈ కార్డులో క‌నిపిస్తోంది. రిసెప్ష‌న్ డేట్‌తో పాటు వేదిక‌ను రివీల్ చేశారు. ...మార్చి 4 హైద‌రాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ జ‌రుగ‌నుంద‌ని శుభ‌లేఖ‌లో పేర్కొన్నారు. ఈ పెళ్లి కార్డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

రణ‌బాలి...

ప్ర‌స్తుతం విజ‌య్‌ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న క‌లిసి ర‌ణ‌బాలి అనే సినిమాలో న‌టిస్తున్నారు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో ఆంగ్లేయుల‌ను ఎదురించి పోరాడిన యోధుడిగా విజ‌య్ క‌నిపించ‌బోతున్నారు.విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న మూడో సినిమా ఇది. గ‌తంలో వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో గీత‌గోవిందం, డియ‌ర్ కామ్రేడ్ సినిమాలు వ‌చ్చాయి.

Advertisement
Advertisement