త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ranveer Singh | సూప‌ర్ స్టార్లు చ‌ట్టానికి అతీతులు కారు..! ధురంధ‌ర్ హీరోకు హైకోర్టు చుర‌క‌లు..!

Ranveer Singh | ధురంధ‌ర్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. బాలీవుడ్ న‌టుడిపై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. గోవాలో జ‌రిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2025 అవార్డుల వేడుక‌లో రిష‌బ్ శెట్టి న‌టించిన కాంతారా:చాప్ట‌ర్ 1 మూవీలోని ఓ స‌న్నివేశాన్ని అనుక‌రించారు.

P

Entertainment | Published On Feb 24, 2026, 4.13 pm IST

Ranveer Singh | సూప‌ర్ స్టార్లు చ‌ట్టానికి అతీతులు కారు..! ధురంధ‌ర్ హీరోకు హైకోర్టు చుర‌క‌లు..!
Advertisement

Ranveer Singh | ధురంధ‌ర్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్‌కు క‌ర్నాట‌క హైకోర్టు ఊర‌ట‌నిచ్చింది. బాలీవుడ్ న‌టుడిపై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని పోలీసుల‌ను ఆదేశించింది. గోవాలో జ‌రిగిన ఐఎఫ్ఎఫ్ఐ 2025 అవార్డుల వేడుక‌లో రిష‌బ్ శెట్టి న‌టించిన కాంతారా:చాప్ట‌ర్ 1 మూవీలోని ఓ స‌న్నివేశాన్ని అనుక‌రించారు. ర‌ణ్‌వీర్ సింగ్ చేష్ట‌లు కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని.. వెక్కిరించారంటూ ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. భ‌క్తుల మ‌నోభావాలు, క‌ర్నాట‌క తీరప్రాంత చాముండి దైవ సంప్రదాయాన్ని కించ‌ప‌రిచారంటూ న్యాయ‌వాది ప్ర‌శాంత్ మెథాల్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఈ మేర‌కు ప‌లు సెక్ష‌న్ల కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. త‌న‌పై న‌మోదైన క్రిమిన‌ల్ కేసును కొట్టివేయాలంటూ ర‌ణ్‌వీర్ క‌ర్నాట‌క హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఈ పిటిష‌న్‌పై మంగ‌ళ‌వారం జ‌స్టిస్ ఎం నాగ‌ప్ర‌స‌న్న నేతృత్వంలోని బెంచ్ విచార‌ణ చేప‌ట్టింది. అయితే, న‌టుడి ప్ర‌వ‌ర్త‌న‌పై మంద‌లించింది. మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తే సహించబోమని చెప్పింది. దర్యాప్తున‌కు స‌హ‌క‌రించాల‌ని ఆదేశించింది. 'సూపర్ స్టార్లు చట్టానికి అతీతులు కారు' అని హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

గ‌తేడాది న‌వంబ‌ర్ 28న గోవాలో జ‌రిగిన ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుక‌ల్లో ర‌ణ‌వీర్ పంజుర్లి, గుళిగ దేవుళ్ల హావ‌భావాల‌ను అస‌భ్యంగా, హాస్యాస్ప‌దంగా అనుక‌రించార‌ని న్యాయ‌వాది పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. చాముండి దైవాన్ని ఆడదెయ్యంగా బాలీవుడ్ న‌టుడు అభివ‌ర్ణించార‌ని, చాముండి అమ్మవారిని కోస్టల్ క‌ర్నాట‌క ప్రాంత ప్ర‌జ‌లు నిత్యం పూజిస్తారని, దివ్య శక్తికి ప్రతీకగా భావిస్తారని తెలిపారు. న‌టుడి చ‌ర్య‌ల‌తో భ‌క్తుల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీశాయ‌ని పేర్కొన్నారు. అయితే, ఈ వాద‌న‌ల‌ను ర‌ణ్‌వీర్ సింగ్ తోసిపుచ్చారు. రిషబ్ షెట్టి నటనను తాను ప్ర‌శంసించేందుకు మాత్ర‌మే అలా చేశాన‌ని.. ఇందులో దురుద్దేశం ఏమీ లేద‌ని ఆయ‌న త‌ర‌ఫు న్యాయ‌వాదులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement