త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kannada TV Actess | బాత్‌రూమ్‌లో ఆ నటిని సీక్రెట్‌గా వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేసి..

ఈ ఘటనపై ఆ నటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోను ఒక ఇన్‌స్టా అకౌంట్ నుంచి షేర్ చేశారని, అది కూడా నటి ఇన్‌స్టా అకౌంట్ అనుకొని నటి ఫ్రెండ్ ఇన్‌స్టాకి ఆ వీడియోను షేర్ చేశారని పోలీసులు తెలిపారు.

J

Entertainment | Published On Feb 17, 2026, 3.44 pm IST

Kannada TV Actess | బాత్‌రూమ్‌లో ఆ నటిని సీక్రెట్‌గా వీడియో తీసి ఇన్‌స్టాలో షేర్ చేసి..
Advertisement

Kannada TV Actess | కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఓ టీవీ సీరియల్ నటికి చేదు అనుభవం ఎదురైంది. 32 ఏళ్ల ఆ నటి బాత్‌రూమ్‌లో ఉండగా ఓ వ్యక్తి సీక్రెట్‌గా వీడియో రికార్డు చేశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అడ్డం పెట్టుకొని తనను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ ఘటన బెంగళూరులోని ఇండోర్ స్టేడియంలో చోట చేసుకుంది. ఆ స్టేడియంలో ఓ ప్రోగ్రామ్‌కి ఆ నటి అటెండ్ అయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ బాత్‌రూమ్‌ని తను వాడుకుంది. ఆ సమయంలోనే అక్కడే ఉన్నవాళ్లలో ఎవరో తనను సీక్రెట్‌గా వీడియో తీశారు. ఫిబ్రవరి 7న ఈ ఘటన చోటు చేసుకోగా, రికార్డు చేసిన వీడియోను ఆ వ్యక్తి ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

ఈ ఘటనపై ఆ నటి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆ వీడియోను ఒక ఇన్‌స్టా అకౌంట్ నుంచి షేర్ చేశారని, అది కూడా నటి ఇన్‌స్టా అకౌంట్ అనుకొని నటి ఫ్రెండ్ ఇన్‌స్టాకి ఆ వీడియోను షేర్ చేశారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత నిందితుడు.. నటిని బెదిరించడం స్టార్ట్ చేశాడని.. తన దగ్గర ఇంకా ఆ నటి ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని.. తను అడిగినంత డబ్బులు ఇస్తేనే ఆ వీడియోలు డిలీట్ చేస్తా అని బెదిరించడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఒకవేళ అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో వీడియోను షేర్ చేస్తా అని నిందితుడు నటిని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ నిందితుడు వీడియోను షేర్ చేసిన ఇన్‌స్టా అకౌంట్‌ ఐపీ అడ్రస్ ద్వారా నిందితుడిని గుర్తించే పనిలో సైబర్ పోలీసులు పడ్డారు.

Advertisement
Advertisement