త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajpal Yadav | జైళ్లలోనూ స్మోకింగ్ జోన్లు ఉండాలి : న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్‌

Rajpal Yadav | జైళ్ల‌లో సౌక‌ర్యాల‌పై బాలీవుడ్‌ న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్ (Rajpal Yadav) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైల్వే స్టేష‌న్లు, ఎయిర్‌పోర్ట్స్‌లోలాగే జైళ్ల‌లోనూ స్మోకింగ్ జోన్‌లు (Jails need smoking areas) ఏర్పాటు చేయాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

D

Entertainment | Published On Feb 19, 2026, 11.04 am IST

Rajpal Yadav | జైళ్లలోనూ స్మోకింగ్ జోన్లు ఉండాలి : న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్‌
Advertisement

Rajpal Yadav | చెక్‌బౌన్స్ కేసులో అరెస్టైన బాలీవుడ్‌ న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్ (Rajpal Yadav) మంగ‌ళ‌వారం రిలీజ్ అయిన విష‌యం తెలిసిందే. మ‌ధ్యంత‌ర బెయిల్‌పై జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా జైళ్ల‌లో సౌక‌ర్యాల‌పై ఆయ‌న కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రైల్వే స్టేష‌న్లు, ఎయిర్‌పోర్ట్స్‌లోలాగే జైళ్ల‌లోనూ స్మోకింగ్ జోన్‌లు (Jails need smoking areas) ఏర్పాటు చేయాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. పీటీఐతో మాట్లాడుతూ.. ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు.

"జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా మాత్రమే ఉండ‌కూడ‌దు. ఖైదీలు తమ తప్పులను సరిదిద్దుకుని మారడానికి అవకాశం ఇచ్చే సంస్కరణ కేంద్రాలుగా ఉండాలి. బ‌య‌ట నుంచి చూసే వారికి ఎవ‌రు క‌ర‌డుగ‌ట్టిన నేరస్థులు, ఎవ‌రు పొర‌పాటున నేరం చేసిన వ‌చ్చిన వారో అర్థం కాదు. జైల్లో ఉన్న‌ప్పుడు నేను ఒక విషయాన్ని గమనించాను. ఆధునిక కాలానికి అనుగుణంగా జైళ్ల‌లో సౌక‌ర్యాల‌ను మెరుగుప‌ర‌చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇప్పటికే శిక్ష ఖరారైనందున కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేని ఖైదీలు కొందరు ఉంటారు. గత పదేళ్లుగా వారి ప్రవర్తనను, నడవడికను గమనిస్తూనే ఉన్నారు. అటువంటి ఖైదీలకు ముఖ్యంగా ఇప్పటికే 10 నుంచి 15 ఏళ్ల‌ శిక్ష పూర్తి చేసుకున్న వారికి కనీసం 10 శాతం మందిని విడుదల చేసినా లేదా వారికి పునరావాసం కల్పించినా వారు తిరిగి మన దేశానికి సానుకూల సహకారాన్ని అందించే అవకాశం ఉంది" అని రాజ్‌పాల్ యాద‌వ్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

సుమారు రూ.9 కోట్ల రూపాయల చెక్ బౌన్స్ కేసు (cheque bounce case) లో ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఆయనకు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే, ఫిర్యాదుదారుడైన మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.1.5 కోట్ల రూపాయలను డిపాజిట్ చేసిన తర్వాత, కోర్టు ఆయన శిక్షను మార్చి 18 వరకు నిలిపివేస్తూ విడుదల చేయాలని ఆదేశించింది. ఈ మేర‌కు ఫిబ్ర‌వ‌రి 16న న‌టుడికి మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ప‌ది రోజులు శిక్ష అనుభ‌వించిన న‌టుడు రెండు రోజుల క్రితం తీహార్ జైలు నుంచి విడుద‌ల‌య్యారు.

https://x.com/PTI_News/status/2024084288652853525

Advertisement
Advertisement