త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahashivratri | ఈషా యోగా కేంద్రంలో మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.. డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న సినీ తార‌లు

Mahashivratri | కోయంబ‌త్తూర్ (Coimbatore)లోని ఈషా యోగా కేంద్రంలో (Isha Yoga Centre) నిర్వ‌హించిన మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల్లో స్టార్ తార‌లు త‌మ‌న్నా (Tamannaah Bhatia), దురంధ‌ర్ భామ సారా అర్జున్‌ (Sara Arjun), శ్రీ‌నిధి, బాలీవుడ్ న‌టి జూహీచావ్లా స‌హా ప‌లువురు తార‌లు పాల్గొన్నారు.

D

Entertainment | Published On Feb 16, 2026, 10.32 am IST

Mahashivratri | ఈషా యోగా కేంద్రంలో మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.. డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న సినీ తార‌లు
Advertisement

Mahashivratri | దేశ‌వ్యాప్తంగా మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు (Mahashivratri celebrations) ఘ‌నంగా జ‌రిగాయి. భ‌క్తులు ఉద‌యం నుంచే ఆల‌యాల‌కు పోటెత్తి భోళాశంక‌రుడిని ద‌ర్శించుకున్నారు. త‌మిళ‌నాడు (Tamil Nadu) కోయంబ‌త్తూర్ (Coimbatore)లోని ఈషా యోగా కేంద్రంలో (Isha Yoga Centre) కూడా మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో ప‌లువురు సీని సెల‌బ్రిటీలు హాజ‌రై సంద‌డి చేశారు.

స‌ద్గురు నిర్వ‌హించిన మ‌హా శివ‌రాత్రి వేడుక‌ల్లో స్టార్ తార‌లు త‌మ‌న్నా (Tamannaah Bhatia), దురంధ‌ర్ భామ సారా అర్జున్‌ (Sara Arjun), శ్రీ‌నిధి, బాలీవుడ్ న‌టి జూహీచావ్లా స‌హా ప‌లువురు తార‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ప్ర‌ద‌ర్శించిన మ‌హాదేవుడి పాట‌కు డ్యాన్స్ చేసి ఆక‌ట్టుకున్నారు. వారితోపాటూ వేడుక‌ల‌కు హాజ‌రైన‌వారు కూడా భ‌క్తిపార‌వ‌శ్యంలో మునిగిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైర‌ల్ అవుతున్నాయి.

https://x.com/ANI/status/2023189194626220365

Advertisement
Advertisement