Mouni Roy | భర్తతో విడాకుల వార్తలు.. ఎట్టకేలకు మౌనం వీడిన మౌనిరాయ్..!
Mouni Roy | బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహ బంధం ముగిసిందని, ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్‌గా మారడంతో ఎట్టకేలకు మౌని రాయ్ స్వయంగా స్పందించింది.
Entertainment | Published On May 13, 2026, 4.22 pm IST
Mouni Roy | బాలీవుడ్ నటి మౌని రాయ్ వ్యక్తిగత జీవితంపై ఇటీవల సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌తో ఆమె వివాహ బంధం ముగిసిందని, ఇద్దరూ విడిపోయి వేర్వేరుగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ వార్తలు వైరల్‌గా మారడంతో ఎట్టకేలకు మౌని రాయ్ స్వయంగా స్పందించింది. బుధవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్టోరీ షేర్ చేసింది. తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని అభిమానులు, మీడియాకు విజ్ఞప్తి చేసింది.
“దయచేసి ఎలాంటి అసత్య వార్తలను వ్యాప్తి చేయవద్దు. మాకు కొంత ప్రైవసీ, స్పేస్ ఇవ్వండి” అని ఆమె పేర్కొంది. చివరగా ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎమోజీని జత చేసింది. అయితే, ఈ విషయంలో పూర్తిస్థాయిలో క్లారిటీ రాలేదు. నిజంగా ఇద్దరూ విడిపోయారా.. వేర్వేరుగా ఉంటున్నారా అన్న దానిపై మౌని నుంచి స్పష్టమైన వివరణ లేదు. గత కొంతకాలంగా మౌని సూర్‌తో కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకపోవడం అభిమానులు అనుమానిస్తున్నారు.
ఇటీవల మౌని, సూరజ్ ఇద్దరూ ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే, పెళ్లి ఫొటోలు కూడా సోషల్ మీడియా నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాల తర్వాత సూరజ్ నంబియార్ తన సోషల్ మీడియా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయడం గమనార్హం. ఈ వార్తలు ఇద్దరు విడిపోయారన్న వార్తలకు బలం చేకూరినట్లయ్యింది. మౌని రాయ్, సూరజ్ నంబియార్ 2022 జనవరి 27న గోవాలో బెంగాలీ, మలయాళీ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. 2019లో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. కొద్దిరోజులకే పెళ్లితో ఒక్కటయ్యారు. అప్పటినుంచి వీరిద్దరూ తరచూ కలిసి ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



