త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mouni Roy | నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెర‌.. నంబియార్‌తో విడాకుల‌ను ధ్రువీక‌రించిన మౌనీ రాయ్‌..!

Mouni Roy | బాలీవుడ్ న‌టి, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. విడాకుల తీసుకున్న‌ట్లుగా ధ్రువీక‌రించింది. ఈ మేర‌కు ఇద్ద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు.

P

Entertainment | Published On May 14, 2026, 8.05 pm IST

Mouni Roy | నాలుగేళ్ల వైవాహిక బంధానికి తెర‌.. నంబియార్‌తో విడాకుల‌ను ధ్రువీక‌రించిన మౌనీ రాయ్‌..!
Advertisement

Mouni Roy | బాలీవుడ్ న‌టి, నాగిని ఫేమ్ మౌనీ రాయ్ వైవాహిక జీవితానికి ముగింపు ప‌లికింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. విడాకుల తీసుకున్న‌ట్లుగా ధ్రువీక‌రించింది. ఈ మేర‌కు ఇద్ద‌రు సోష‌ల్ మీడియా వేదిక‌గా సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇకపై తమ జీవితాల్లో కొత్త దారుల్లో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో ఈ విడిపోతున్న నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

అయినప్పటికీ భవిష్యత్తులో పరస్పర గౌరవంతో స్నేహాన్ని కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. ఇక ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకుని తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని కోరారు. తమ వ్యక్తిగత జీవితాలపై జరుగుతున్న అనవసర ప్రచారం, ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వాస్త‌వానికి విరుద్ధంగా వ‌చ్చే క‌థ‌నాల‌ను న‌మ్మొద్ద‌ని విజ్ఞ‌ప్తి చేశారు. గ‌త కొద్దిరోజులుగా ఇద్ద‌రు విడిపోతున్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రిగింది. ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో కావడం, అలాగే మౌనీ రాయ్ ప్రొఫైల్‌లో సూరజ్‌తో ఉన్న ఫొటోలు డిలీట్ చేయ‌డంతో డివోర్స్ తీసుకుంటున్న‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. తాజాగా అధికారికంగా ప్ర‌క‌టించ‌డంతో నిజ‌మ‌ని తేలింది.

మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ జనవరి 2022లో గోవాలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఈ పెళ్లి బాలీవుడ్‌లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. మౌని సినీ కెరీర్ విషయానికి ‘కస్తూరి’, ‘దేవోం కే దేవ్.. మహాదేవ్’, ‘నాగిన్’ త‌దిత‌ర సీరియల్స్‌తో మంచి గుర్తింపు సాధించింది. రియాలిటీ షోలు ‘నాచ్ బలియే 6’, ‘ఝలక్ దిఖ్ లా జా 7’లో పాల్గొన్నారు. ఇటీవల ‘టెంప్టేషన్ ఐలాండ్ ఇండియా’ షోకు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించింది. ‘బ్రహ్మాస్త్ర: పార్ట్ వన్ – శివ’, ‘గోల్డ్’, ‘మేడ్ ఇన్ చైనా’ త‌దిత‌ర చిత్రాల్లో న‌టించింది.

 

View this post on Instagram

 

A post shared by mon (@imouniroy)

 

Advertisement
Advertisement