Mohanlal | ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన మోహన్‌లాల్..!
Mohanlal | సాధారణంగా సినీ హీరోలను రాజకీయ ప్రముఖులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలను చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ రాజకీయ నాయకుడిని స్టార్ హీరో ఇంటర్వ్యూ చేయడం ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Feb 24, 2026, 8.34 pm IST
Mohanlal | సాధారణంగా సినీ హీరోలను రాజకీయ ప్రముఖులను జర్నలిస్టులు ఇంటర్వ్యూలను చేయడం చూసే ఉంటారు. కానీ, ఓ రాజకీయ నాయకుడిని స్టార్ హీరో ఇంటర్వ్యూ చేయడం ఆసక్తికరంగా మారింది. మలయాళ సూపర్ స్టార్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్ కేరళ సీఎం పినరయి (Pinarayi Vijayan)ని ఇంటర్వ్యూ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఎప్పుడూ జర్నలిస్టులకు సమాధానం ఇచ్చే ఈ నటుడు.. ఆ పాత్రలోకి మారి.. ప్రశ్నలు అడడం కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఇంటర్వ్యూ సీఎం అధికారిక నివాసం క్లిఫ్ హౌస్‌లో జరిగింది. మోహన్‌లాల్ రెండురోజుల పాటు తిరువనంతపురంలో ఉండి.. ఒకరోజు చర్చలు జరిపారు.
ఆ తర్వాత ఇంటర్వ్యూ చిత్రీకరించారు. ఇందులో సీఎం వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానం, ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలున్నాయి. ఇందుకు సంబంధించిన టీజర్ విడుదల కాగా.. త్వరలోనే పూర్తిస్థాయి ఇంటర్వ్యూను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. త్వరలో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే విజయన్ సర్కారు ఇంటర్వ్యూ.. కేవలం పీఆర్ స్టంట్‌గా పలు పార్టీలు వ్యాఖ్యానించాయి. అయితే, మోహన్‌లాల్ ఇలా సీనియర్ రాజకీయ నేతలను ఇంటర్వ్యూ చేయడం కొత్తేం కాదు. గతంలో మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
https://x.com/iprdkerala/status/2026281797303296302
సంబంధిత వార్తలు

Drishyam 3 Twitter Review | దృశ్యం 3 ట్విట్టర్ రివ్యూ – మోహన్ లాల్ మూవీకి ఊహించని టాక్ – ఏదో అనుకుంటే?
మే 21, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



