త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mirnaa Menon | జైలర్‌-2లో భారీ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌.. హింట్ ఇచ్చిన మిర్నా మీనన్..!

Mirnaa Menon | మిర్నా మీనన్ పేరు చెప్తే చాలా మందికి పెద్దగా గుర్తు రావకపోవచ్చు. కానీ ‘జైలర్లో’ రజనీకాంత్‌కు కోడలిగా కనిపించిన ఆ చిన్న పాత్రే ఆమెకు పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ పాత్రతోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు అదే పాత్రలో ‘జైలర్ 2’లో కూడా ఆమె కనిపించబోతోంది.

P

Entertainment | Published On Mar 25, 2026, 6.30 pm IST

Mirnaa Menon | జైలర్‌-2లో భారీ ఇంటర్వెల్‌ బ్యాంగ్‌.. హింట్ ఇచ్చిన మిర్నా మీనన్..!
Advertisement

Mirnaa Menon | మిర్నా మీనన్ పేరు చెప్తే చాలా మందికి పెద్దగా గుర్తు రావకపోవచ్చు. కానీ ‘జైలర్లో’ రజనీకాంత్‌కు కోడలిగా కనిపించిన ఆ చిన్న పాత్రే ఆమెకు పెద్ద గుర్తింపును తీసుకొచ్చింది. అప్పటి నుంచి ఆ పాత్రతోనే ఆమెకు మంచి క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు అదే పాత్రలో ‘జైలర్ 2’లో కూడా ఆమె కనిపించబోతోంది. ఇటీవల ఒక కాలేజీ ఈవెంట్‌లో పాల్గొన్న జైలర్‌-2 మూవీ గురించి కీలక అప్‌డేట్స్‌ బయటపెట్టింది. మూవీలో కీలకమైన ఆ సీన్ గురించి చెప్పడం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచింది. జైలర్‌ మూవీలో రజనీకాంత్ ‘ముత్తువేల్ పాండ్యన్’ పాత్రలో కనిపించారు.

ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.600 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. అందులోని ఇంటర్వెల్ సీన్ ఇప్పటికీ చాలామందికి గుర్తుండిపోయే ఉంటుంది. మిర్నా ఆ సీన్ గురించే మాట్లాడింది. జైలర్‌-2లో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అంతకు మించి ఉంటుందని తెలిపింది. ‘తొలిభాగంలోనే అంత ఉంటే.. రెండో భాగం ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించండి’ అంటూ మరింత హైప్ పెంచేసింది. తాను ఆ సీన్‌లో ఉంటానా లేదా తెలుసుకోవాలంటే థియేటర్‌కే రావాలని చెప్పింది. రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. ఆయనను చూస్తే ‘పడయప్ప’ సినిమాలో రమ్యకృష్ణ చెప్పిన డైలాగ్ గుర్తొస్తుందని చెప్పింది.

వయసు పెరిగినా ఆయన స్టైల్, గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని ఆమె అభిప్రాయపడింది. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని కూడా చెప్పింది. దర్శకుడు నెల్సన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ అందిస్తున్నాడు. తొలి భాగంలాగే ఈ సీక్వెల్‌లో కూడా కొన్ని సర్‌ప్రైజ్ కేమియోలు ఉండే అవకాశం ఉంది. మిథున్ చక్రవర్తి, షారుఖ్ ఖాన్, ఎస్‌జే సూర్య, విజయ్ సేతుపతి స్టార్‌ సైతం కనిపించనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ‘జైలర్ 2’ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక రజనీకాంత్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement