Manushi Chhillar | నేను ఒంటరిగా లేను..! ఇన్‌స్టా చిట్‌చాట్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడించిన మానుషి చిల్లర్
Manushi Chhillar | ఫిట్‌నెస్‌ను బరువుతో కొలవలేమని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను గతంలో లేనంత బరువుగా ఉన్నప్పటికీ, అదే సమయంలో మరింత బలంగా ఉన్నానని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది.
Entertainment | Published On Feb 14, 2026, 2.00 pm IST
Manushi Chhillar | ఫిట్‌నెస్‌ను బరువుతో కొలవలేమని మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను గతంలో లేనంత బరువుగా ఉన్నప్పటికీ, అదే సమయంలో మరింత బలంగా ఉన్నానని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ అభిమాని మీరు బరువును ఎలా నియంత్రించుకుంటారు? అని ప్రశ్నించగా.. తన అభిప్రాయం వెల్లడించింది. ‘నేను వెయిట్‌ని ఫిట్‌నెస్‌కి ప్రమాణంగా తీసుకోను. ఇప్పటివరకు ఉన్న దానికంటే ఇప్పుడు నా బరువు ఎక్కువే. కానీ, నేను మరింత బలంగా ఉన్నాను. అది కండరాల పెరుగుదల వల్లేనని అనుకుంటున్నాను’ అంటూ రిప్లయ్ ఇచ్చింది.
అంకెలు మాత్రమే శరీర దృఢత్వాన్ని నిర్వచించవని చెప్పుకొచ్చింది. తాను పూర్తిగా ఉదయాన్నే లేచే వ్యక్తినని, సినీ రంగంలోని వృత్తి కారణంగా జీవనశైలిలో మార్పులు వచ్చాయని తెలిపారు. ‘నేను వంద శాతం ఉదయం లేచే వ్యక్తిని. కానీ, నా పని నన్ను రాత్రి వేళల్లో మేల్కొని ఉండేలా మార్చింది’ చెప్పింది. ముంబయిలో ఒంటరిగా ఉంటారా? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. ‘నేను ఒంటరిగా ఉండడం లేదు. ముంబయికి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని కూడా నాతో పాటు తీసుకొచ్చాను. మేమంతా కలిసి ఒక పెద్ద సంతోషకరమైన కుటుంబంలా ఉంటున్నాం’ అని వెల్లడించారు. కుటుంబంతో కలిసి ఉండడం తనకు మానసిక బలాన్నిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఫిట్‌నెస్ ప్రయాణం గురించి మాట్లాడిన మనుషి, మూడు సంవత్సరాల క్రితం ఓ సినిమా కోసం బాక్సింగ్, యుద్ధకళల్లో శిక్షణ ప్రారంభించానని తెలిపారు.
మొదట సినిమా అవసరాల కోసం మొదలుపెట్టిన ఈ శిక్షణ ఇప్పుడు తనకు అత్యంత ఇష్టమైన వ్యాయామంగా మారిందని చెప్పారు. సమయం దొరికినప్పుడల్లా అదే సాధన చేస్తానని ఆమె వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మానుషి చివరిసారిగా మాలిక్ చిత్రంలో నటించారు. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలోని ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావ్‌కు జోడిగా నటించింది. పుల్కిత్ దర్శకత్వంలో కుమార్ తౌరాణి, జయ్ శేవక్రమాణి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది జూన్‌లో విడుదలైంది. అలాగే, జాన్ అబ్రహం ప్రధానపాత్రలో నటించిన టెహ్రాన్ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందించిన మూవీ అభిమానులను ఆకట్టుకుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



