Malayalam Singer | సోషల్ మీడియాలో వేధింపులు – మలయాళీ సింగర్ ఎమోషనల్ పోస్ట్
బాడీ షేమింగ్, సోషల్ మీడియా వేధింపులపై మలయాళీ సింగర్ గాయత్రి సురేష్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా వేధింపుల వలన తాను గత కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రుళ్లు గడపాల్సివస్తుందని అన్నది.
Entertainment | Published On Feb 5, 2026, 12.46 pm IST
Malayalam Singer | సోషల్ మీడియాలో తనకు ఎదురైన వేధింపులపై మలయాళీ సింగర్ అభిరామి సురేష్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఊహ తెలిసినప్పటి నుంచి అవమానాలు, అసభ్యపు కామెంట్లను ఎదుర్కొంటూనే ఉన్నానని చెప్పింది. సోషల్ మీడియాను డస్ట్‌బిన్‌గా పోల్చుతూ వరుసగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్‌లు వైరల్ అవుతోన్నాయి. ఫిబ్రవరి 1న లైవ్ మ్యూజిక్ షోలో అభిరామి సురేష్ పాల్గొన్నది. ఈ షోలో ఆమె బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డ్రెస్టింగ్ స్టైల్‌ను విమర్శిస్తూ పలువురు నెటిజన్లు అసభ్యకర కామెంట్లు పెడుతోన్నారు. ఆమెపై బాడీ షేమింగ్‌కు పాల్పడ్డారు. ఈ విమర్శలపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా రియాక్ట్ అయ్యింది అభిరామి సురేష్.
లైవ్ షోలో....
ఈ బాడీ షేమింగ్ కామెంట్ల వల్ల కొద్ది రోజులుగా నిద్రలేని రాత్రులను గడపాల్సివస్తుందని అన్నది. లైవ్ షోలలో ఒకే చోట కదలకుండా ఉంటూ పర్ఫార్మెన్స్ చేయడం కుదరదని, మ్యూజిక్‌కు తగ్గట్లుగా పాటలు పాడుతూ డ్యాన్స్ చేయాల్సివస్తుందని అభిరామి సురేష్ అన్నది. "నా పర్ఫార్మెన్స్‌ను తప్పుడు యాంగిల్స్‌లో చూపిస్తూ వందలాది వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్నాయని, తనను బాడీ షేమింగ్ చేస్తూ అసహ్యకరమైన కామెంట్లు పెడుతున్నారని" గాయత్రి సురేష్ భావోద్వేగానికి గురైంది.
"ఈ వేధింపులకు సంబంధించి గత కొద్ది రోజులుగా నా మనసులో ఉన్న మొత్తం భారాన్ని అంతా బయటపెడితేనే ఊరటగా ఉంటుందని అనిపించింది. కలలో కూడా నేను ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టలేదు. అయినా నన్ను చాలా మంది ఎందుకు ద్వేషిస్తూ అవమానాలకు గురిచేస్తున్నారో తెలియడం లేదు. సమాజంలో ప్రతి ఒక్కరికి గౌరవంగా బతికే హక్కు ఉంది. ఈ వేధింపులను ఎదుర్కోవడానికి ఆత్మ విశ్వాసమే తనకు కవచంలా నిలిచింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల తోడ్పాటుతో వేధింపులను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నానని" అభిరామి సురేష్ అన్నది.
పోటీపడుతున్నారు...
తనపై సోషల్ మీడియాలో అభ్యంతరకరకామెంట్లు చేసేందుకు చాలా మంది పోటీపడుతున్నారని, తన వ్యక్తిత్వాన్ని కించపరిచే ప్రయత్నంలో తమ సమయాన్ని, శక్తిని కూడా వృథా చేసుకుంటున్నారని అలాంటి వారి గురించి ఆలోచించాల్సిన పనిలేదని అభిరామి సురేష్ అన్నది. ఆమె పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. అభిరామి సురేష్ సోదరి అమృత సురేష్ ఇటీవలే సోషల్ మీడియా వేధింపులపై పోస్ట్ పెట్టారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






