త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mahima Nambiar | టాలీవుడ్‌కు మ‌రో కేర‌ళ కుట్టి..! ఎట్టకేలకు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న మహిమా నంబియార్‌

Mahima Nambiar | తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే ఎంతో మంది మలయాళ హీరోయిన్లు న‌టించారు. నయనతార, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ స‌హా ప‌లువురు భామలు టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు మరో కేర‌ళ కుట్టి చేర‌బోతున్న‌ది.

P

Entertainment | Published On Jul 1, 2026, 3.40 pm IST

Mahima Nambiar | టాలీవుడ్‌కు మ‌రో కేర‌ళ కుట్టి..! ఎట్టకేలకు తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న మహిమా నంబియార్‌
Advertisement

Mahima Nambiar | తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్ప‌టికే ఎంతో మంది మలయాళ హీరోయిన్లు న‌టించారు. నయనతార, నిత్యా మీనన్, అనుపమ పరమేశ్వరన్, సంయుక్త మీనన్ స‌హా ప‌లువురు భామలు టాలీవుడ్‌లో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే జాబితాలో చేరేందుకు మరో కేర‌ళ కుట్టి చేర‌బోతున్న‌ది. ఆమె ఎవ‌రో కాదు మహిమా నంబియార్. తమిళ, మలయాళ చిత్రాల్లో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆమె.. తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా రూపొందనున్న కొత్త చిత్రంలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా ఎంపికైంది. కోన వెంకట్ సమర్పణలో జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే షూటింగ్ మొద‌లుకానుంది. శ్రీవిష్ణు-మహిమా కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఆసక్తి నెలకొంది.

కేరళలోని కాసరగోడ్‌కు చెందిన మహిమా నంబియార్ చిన్నప్పటి నుంచే శాస్త్రీయ నృత్యం, సంగీతంలో శిక్షణ పొందింది. బాలనటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది. 15 ఏళ్ల వయసులో మలయాళ స్టార్ హీరో దిలీప్ నటించిన 'కార్యస్థాన్' సినిమాతో వెండితెరకు పరిచయమైంది. అనంతరం తమిళంలో వచ్చిన 'సాట్టై' చిత్రంతో కథానాయికగా మారి.. తొలి చిత్రంతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'కుట్రమ్ 23', 'మగముని', 'చంద్రముఖి-2', 'రత్తం', ముత్తయ్య మురళీధరన్ జీవితకథ ఆధారంగా రూపొందిన '800' వంటి చిత్రాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి తన నటనతో ఆకట్టుకుంది.

మలయాళంలో 'ఆర్‌డీఎక్స్' చిత్రం ఆమెకు మరింత గుర్తింపు తీసుకొచ్చింది. ఇటీవల 'జై గణేశ్', 'బ్రోమాన్స్' వంటి చిత్రాలతోనూ ప్రేక్షకులను అలరించింది. గ్లామర్‌తో పాటు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న మహిమా నంబియార్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనే ఆసక్తి సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కథల ఎంపికలో ప్రత్యేక గుర్తింపు ఉన్న శ్రీవిష్ణుతో ఆమె తొలి తెలుగు సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలున్నాయి. టాలీవుడ్‌లో ఈ కేరళ భామ ఎలాంటి ముద్ర వేస్తుందో చూడాలి.

Advertisement
Advertisement