త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Harnaaz Sandhu | మహావతార్‌లో మిస్‌ యూనివర్స్‌.. విక్కీ కౌశల్‌కు జోడీగా హర్నాజ్‌ సందు..!

Harnaaz Sandhu | మహావతార్ సినిమా కాస్టింగ్‌పై ఆసక్తికర చర్చ నడుస్తోంది. విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‌గా హర్నాజ్ సందు పేరును పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. కొత్త జోడీతో ప్రేక్షకులకు తాజాదనం ఇవ్వాలన్న ఉద్దేశంతో మేకర్స్ ముందుకెళ్తుండగా, ఈ ప్రాజెక్ట్ హర్నాజ్ కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా నిలుస్తుందని ఇండస్ట్రి వర్గాలు పేర్కొంటున్నాయి.

P

Entertainment | Published On Apr 22, 2026, 6.05 pm IST

Harnaaz Sandhu | మహావతార్‌లో మిస్‌ యూనివర్స్‌.. విక్కీ కౌశల్‌కు జోడీగా హర్నాజ్‌ సందు..!
Advertisement

Harnaaz Sandhu | ‘మహావతార్’ సినిమా కాస్టింగ్ మరోసారి బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరో విక్కీ కౌశల్ సరసన హీరోయిన్‌గా హర్నాజ్ సందు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త బాలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్‌లో చర్చనీయాంశంగా మారింది. గతంలో దీపికా పదుకొణె, శ్రద్ధా కపూర్‌ పేర్లు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా హర్నాజ్ సందు పేరు తెరపైకి వచ్చింది. అయితే, ఈ ప్రాజెక్ట్‌లో కొత్త జంటను పరిచయం చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలుస్తోంది. విక్కీ కౌశల్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ని తీసుకోవడం ద్వారా కథలో కొత్తదనం తీసుకురావాలన్నది మేకర్స్‌ ఉద్దేశంగా తెలుస్తోంది.

ఇద్దరూ పంజాబీ బ్యాక్‌ గ్రౌండ్‌కు చెందిన వారే కావడం కూడా హర్నాజ్‌ ఎంపికకు ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. మిథాలజికల్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కాస్టింగ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. మూవీపై ప్రేక్షకుల్లో నమ్మకం కలిగించాలంటే పాత్రలకు సరిపోయే నటీనటులను ఎంపిక చేయడం కీలకం. ఈ నేపథ్యంలో కొత్త హీరోయిన్‌ను తీసుకోవడం సినిమాకు ఒరిజినాలిటీ తీసుకురావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, 2021లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని సొంతం చేసుకున్న హర్నాజ్ సందుకు ఇప్పటికే మంచి గుర్తింపు ఉంది. పేజెంట్స్ నుంచి సినిమాల వైపు అడుగులు వేస్తున్న ఆమెకు.. ఈ చిత్రం కెరీర్‌లో కీలక మలుపు కావచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు స్టార్ హీరో విక్కీ కౌశల్, మరోవైపు కొత్త ఉత్సాహంతో ఉన్న హర్నాజ్ సందు జోడీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో ఈ జోడీపై మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. తెరపై కొత్త జోడీని చూడాలని కొందరు అభిమానులు ఆసక్తిని వ్యక్తం చేయగా.. మరికొందరు స్టార్‌ హీరోయిన్లను తీసుకుంటేనే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరో వైపు కాస్టింగ్ విషయంలో మేకర్స్ పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్నట్లు తెలుస్తోంది. భిన్నంగా ఆలోచిస్తూ తెరపై కొత్త కెమిస్ట్రీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారని సమాచారం. ఇదే ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశంగా మారే అవకాశం ఉంది. ఇక విక్కీ కౌశల్ ఈ చిత్రానికి ప్రత్యేకంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రెజ్లర్ తరహా బాడీ లుక్ కోసం కఠినమైన ఫిట్‌నెస్ ట్రైనింగ్ తీసుకుంటూ, పొడవైన జుట్టుతో రగ్గడ్ లుక్‌లో కనిపించనున్నారని సమాచారం. ‘మహావతార్’ కాస్టింగ్‌పై విషయంలో ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించకపోయినా.. కాస్టింగ్‌ విషయంలో వస్తున్న వార్తలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఒకవేళ ఈ ప్రాజెక్టులో హీరోయిన్‌గా హర్నాజ్ సందు ఫైనల్ అయితే.. కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా కానుంది.

Advertisement
Advertisement