Krystle D’Souza | ఇంత హిట్ అవుతుందనుకోలేదు.. : షెరారత్ సాంగ్ క్రేజ్‌పై క్రిస్టెల్ డిసౌజ కామెంట్
Krystle D'Souza | షరారత్ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ మూవీలో తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేసింది. ఆయేషా ఖాన్‌తో కలిసి క్రిస్టెల్ వేసిన స్టెప్పులను విజయ్ గంగూలీ కొరియోగ్రాఫర్ చేశారు. పెళ్లి సంబరాల నేపథ్యంలో సాగే ఈ పాట పార్టీ బీట్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టెల్ పాటకు మంచి రెస్పాన్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేసింది.
Entertainment | Published On Feb 13, 2026, 12.30 pm IST
Krystle D'Souza | షరారత్ సాంగ్‌తో ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ధురంధర్ మూవీలో తొలిసారిగా ఐటమ్ సాంగ్ చేసింది. ఆయేషా ఖాన్‌తో కలిసి క్రిస్టెల్ వేసిన స్టెప్పులను విజయ్ గంగూలీ కొరియోగ్రాఫర్ చేశారు. పెళ్లి సంబరాల నేపథ్యంలో సాగే ఈ పాట పార్టీ బీట్స్, ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్రిస్టెల్ పాటకు మంచి రెస్పాన్స్ రావడంపై ఆనందం వ్యక్తం చేసింది.
“పాట విడుదలైన వెంటనే అది ఎంత పెద్ద హిట్ అయిందో నాకు అర్థం కాలేదు. ఆ సమయంలో నేను ఇండియాలో లేను. ట్రావెల్‌లో ఉండగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ‘షరారత్’ కనిపించింది. ఐదు నిమిషాలకు ఒకసారి ఎవరో ట్యాగ్ చేస్తున్నారు. ఇంట్లో వాళ్లు, స్నేహితులు ఫోన్ చేసి ‘పాట వైరల్ అయ్యింది’ అని చెప్పడంతోనే విషయం తెలిసింది. అప్పటికి నేను ఆమ్‌స్టర్‌డామ్‌లో ఉన్నాను. నిజంగా ఏమైందో అర్థం కాలేదు. ఇండియాకు తిరిగి వచ్చాక కారులో రేడియో ఆన్ చేస్తే అదే పాట వినిపించడంతో అప్పుడు దాని క్రేజ్ తెలిసింది. పాట మొదటిసారి వినగానే చాలా క్యాచీగా అనిపించింది.
మీటింగ్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తూ తానే ఆ ట్యూన్ హమ్ చేసుకుంటూ వెళ్లాను. అప్పుడే అందరికీ నచ్చుతుందనిపించింది. కానీ ఇంత పెద్ద స్థాయిలో హిట్ అవుతుందని ఊహించలేదు.” సాంగ్‌లో చేసే అవకాశం ఎలా వచ్చిందని ప్రశ్నించగా.. “ముకేశ్ ఛబ్రా కాస్టింగ్ ఏజెన్సీ నుంచి కాల్ వచ్చింది. మరుసటి రోజు టెస్ట్‌కు రావాలని చెప్పారు. అక్కడ విజయ్ గంగూలీ, ఆదిత్య ధర్‌ని కలిశాను. కొన్ని హుక్ స్టెప్పులు ట్రై చేశాం. ఎంపికయ్యాక మూడు రోజుల్లోనే షూట్ అని చెప్పారు. రిహార్సల్స్‌కు చాలా తక్కువ సమయం దొరికింది. ఇది సాధారణ ఐటమ్ సాంగ్ కాదు. పెళ్లి నేపథ్యంలో ఇద్దరు అమ్మాయిల మధ్య సరదా, ఉత్సాహం ఎలా ఉంటుందో చూపించాలని ప్రయత్నం చేశాం. మా వ్యక్తిత్వాలు భిన్నంగా ఉండడం ఈ పాటకు ప్రత్యేకత ఇచ్చింది” అని తెలిపింది.
ఆయేషా ఖాన్ గురించి మాట్లాడుతూ.. “ఆమె చాలా స్వీట్, అద్భుతమైన డ్యాన్సర్. ఆమెతో కలిసి డ్యాన్స్ చేస్తానని తెలిసినప్పుడు ఆమె ఇన్‌స్టాగ్రామ్ చూశాను. ఆమె డ్యాన్స్ చూసి నాకు మరింత మోటివేషన్ లభించింది. మంచి కో-డ్యాన్సర్ ఉంటే డ్యాన్స్ మరింత మెరుగ్గా వస్తుంది. సెట్స్‌లో సహజంగానే ఒకరినొకరిని కంప్లిమెంట్ చేసుకున్నాం. సాంగ్ లాంచ్‌రోజున స్టేజ్‌పై డ్యాన్స్ చేసే ప్లాన్ అసలు లేదు. గాయని జాస్మిన్ సండ్లాస్, మధుబంటి బాగ్చీ పాట పాడుతుండగా ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించారు. రణవీర్ ‘ఇది నీ పాట, స్టేజ్‌పైకి వచ్చి పెర్ఫామ్ చేద్దాం’ అని అన్నాడు. మొదట కొంచెం సందేహపడ్డాను, కానీ ఆయన ఇచ్చిన ఎనర్జీతో చేశాను. స్టేజ్‌పై నాకు ప్రత్యేకంగా స్పేస్ ఇచ్చి ప్రోత్సహించారు. అది చాలా ప్రత్యేక అనుభూతి” ఇచ్చిందని పేర్కొంది.
“నాన్నకు బాలీవుడ్‌పై పెద్ద ఆసక్తి ఉండదు. కానీ ఇప్పుడు నన్ను చూసిన ప్రతిసారి ఆ స్టెప్పులు చేసి చూపిస్తారు. అదే నాకు గొప్ప కాంప్లిమెంట్. ఇండస్ట్రీలో 17 ఏళ్లుగా ఉన్నాను. టెలివిజన్ నుంచి ఓటీటీ, అక్కడి నుంచి సినిమాలకు మారడం సులభం కాదు. ‘నువ్వు ఎక్కువగా కనిపించావు, కొత్త ముఖం కావాలి’ అన్న మాటలు విన్నాను. కొన్నిసార్లు వదలేయాలనిపించింది. కానీ, అనుభవమే నాకు బలం అయింది. ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా ఆనందంగా ఉంది” అని క్రిస్టెల్ డిసౌజా తెలిపింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






