Kriti Sanon | కాక్‌టెయిల్-2లో మరింత గ్లామరస్‌గా కనిపిస్తా : కృతి సనన్
Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కాక్‌టెయిల్-2 మూవీలో నటిస్తుంది. షాహిద్ కపూర్, రష్మిక మందనా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కృతి సనన్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
Entertainment | Published On Mar 30, 2026, 2.54 pm IST
Kriti Sanon | బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కాక్‌టెయిల్-2 మూవీలో నటిస్తుంది. షాహిద్ కపూర్, రష్మిక మందనా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా కృతి సనన్ తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ హంగామా నివేదిక ప్రకారం.. ఈ చిత్రంలో తన లుక్ ఇప్పటివరకు చేసిన పాత్రలతో పోలిస్తే భిన్నంగా ఉంటుందని కృతి తెలిపింది. ఈ మూవీలో ‘నేను చాలా కొత్తగా కనిపిస్తాను. ఇదే నా కెరీర్‌లో మరింత గ్లామరస్ పాత్ర కావచ్చు’ అని పేర్కొంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని అభిప్రాయపడింది. దర్శకుడు హోమి అదజానియా గురించి కృతి మాట్లాడుతూ.. ఆయనకు మంచి సౌందర్య దృష్టి ఉందని, ఎంతో కూల్ వ్యక్తిత్వమని చెప్పింది.
‘నాలో నాకు తెలియని ఓ కొత్త కోణం ఆయన బయటకు తీసుకొచ్చారు’ అని వివరించింది. తన గత చిత్రం తేరే ఇష్క్ మే మూవీ భావోద్వేగాలతో నిండిందని, అందుకే ఈసారి తేలికైన, వినోదాత్మక కథలో నటించాలని అనుకున్నానని కృతి తెలిపింది. ‘కాక్‌టెయిల్ 2’ ఆఫర్ వచ్చిన వెంటనే అంగీకరించానని.. ఇదే ‘తాను చేయాలనుకున్న సినిమా’ అని చెప్పింది. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఇష్టమని కూడా కృతి వెల్లడించింది. ‘కాక్‌టెయిల్ 2’ చిత్రం 2012లో వచ్చిన సూపర్‌హిట్ కాక్‌టెయిల్‌కు సీక్వెల్. ఈ సినిమాలో షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ట్రాయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోంది. స్నేహం, సంబంధాల మధ్య ఉన్న సంక్లిష్టతలను ఈ మూవీలో చూపించనున్నారు. ఈ మూవీ జూన్ 2026న విడుదల కానుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



