త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చ‌ర్చించ‌డం ఆశ్చ‌ర్య‌మేసింది..! కృతి స‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

Kriti Sanon | బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ రక్షాబంధన్‌ సందర్భంగా తాను నటించిన ఓ యాడ్ వివాదంపై స్పందించింది. కరీనా కపూర్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్‌ టాక్‌ షో ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’ సీజన్‌-6 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కరీనా, కృతి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది.

P

Entertainment | Published On Oct 7, 2026, 5.55 pm IST

Kriti Sanon | నా దుస్తులపై టీవీ షోలో చ‌ర్చించ‌డం ఆశ్చ‌ర్య‌మేసింది..! కృతి స‌న‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..
Advertisement

Kriti Sanon | బాలీవుడ్‌ నటి కృతి సనన్‌ రక్షాబంధన్‌ సందర్భంగా తాను నటించిన ఓ యాడ్ వివాదంపై స్పందించింది. కరీనా కపూర్‌ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న పాపులర్‌ టాక్‌ షో ‘వాట్‌ ఉమెన్‌ వాంట్‌’ సీజన్‌-6 త్వరలో ప్రారంభం కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో కరీనా, కృతి మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా సాగింది. రక్షాబంధన్‌ సందర్భంగా జ్యువెలరీ బ్రాండ్‌ జీవా రూపొందించిన ప్రకటనలో కృతి తన సోదరుడితో పాటు పెంపుడు కుక్కకు రాఖీ కడుతూ క‌నిపించింది. ఈ యాడ్‌లో ఆమె ధరించిన ఇండో-వెస్ట్రన్‌ దుస్తులపై కొందరు సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సంప్రదాయ పండుగకు ఇలాంటి దుస్తులు సరిపోవంటూ విమర్శలు రావడంతో వివాదం ముదిరింది. కుక్కకు రాఖీ కట్టడం కూడా చర్చనీయాంశమైంది. దీంతో సదరు ప్రకటనను తొలగించారు.

ఈ వివాదంపై కరీనాతో మాట్లాడుతూ కృతి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘నా చోలి గురించి ప్రైమ్‌టైమ్‌ న్యూస్‌లో ఆరుగురు సభ్యుల ప్యానెల్‌ చర్చించడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను’ అని పేర్కొంది. దీనిపై కరీనా కూడా స్పందిస్తూ ఆమెతో ఏకీభవించారు. అనంతరం ‘మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు?’ అని కరీనా అడగ్గా.. ‘తమను జడ్జ్‌ చేయకపోవడం, ఎవరి పని వారు చూసుకోవడం’ అని కృతి సమాధానమిచ్చింది. అప్పట్లో ఈ వివాదంపై కృతి సోషల్‌ మీడియాలోనూ స్పందించింది. పండుగల అసలు స్ఫూర్తి దుస్తుల్లో కాకుండా మనసులోని భావాలు, సంప్రదాయాల్లో ఉంటాయని పేర్కొంది.

రక్షాబంధన్‌ అన్నది అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, రక్షణకు ప్రతీక అని చెప్పింది. తన సోదరి కూడా తనకు రాఖీ కడుతుందని, పరస్పరం ఒకరినొకరు కాపాడుకోవాలని కోరుకుంటామని తెలిపారు. తమ పెంపుడు కుక్కలు కూడా కుటుంబంలో భాగమే కాబట్టి వాటిపట్ల అదే ప్రేమను చూపిస్తామని చెప్పుకొచ్చింది. మహిళల దుస్తులను సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపెట్టడంపైనా కృతి ప్రశ్నలు సంధించారు. ‘మహిళలు ఏం ధరించాలో చెప్పడం ఎప్పుడు ఆపుతాం? సంస్కృతి, సంప్రదాయాలు మనసులో ఉంటాయి.. దుస్తుల్లో కాదు’ అనే భావాన్ని ఆమె వ్యక్తం చేసింది. కాగా, కృతి సనన్‌ చివరిగా ‘కాక్‌టెయిల్‌ 2’ చిత్రంలో కనిపించారు. షాహిద్‌ కపూర్‌, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్‌ కామెడీ డ్రామా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

Advertisement
Advertisement