Kriti Sanon | ఆ మూడు కలిస్తేనే సక్సెస్ సాధ్యం అంటున్న కృతి సనన్..!
Kriti Sanon | విజయానికి కష్టపడటం, ప్రతిభతో పాటు అదృష్టం కూడా అవసరమని కృతి సనన్ పేర్కొంది. అవకాశాలను గుర్తించి, భయాన్ని అధిగమించి ముందడుగు వేయడమే కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తుందని చెప్పుకొచ్చింది.
Entertainment | Published On Apr 26, 2026, 10.15 am IST
Kriti Sanon | బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రస్తుతం వరుస విజియాలతో కెరీర్‌లో దూసుకుపోతున్నది. ఇటీవల పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచి మరింత గుర్తింపును తీసుకువచ్చాయి. అయితే, తన విజయానికి కారణాలు ఏంటో చెప్పింది. కష్టపడేతత్వం, ప్రతిభ, అదృష్టమనే మూడు అంశాలు కలిసినప్పుడు సక్సెస్ అందుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది. మిమి చిత్రంలో నటనకుగాను కృతి జాతీయ పురస్కారం అందుకుంది. తన కెరీర్‌లోనే కీలక మలుపు అక్కడి నుంచే మొదలైంది. ఆ తర్వాత చేసిన పాత్రల్లో వైవిధ్యం కనిపించింది. ముఖ్యంగా తెరె ఇష్క్ మే చిత్రంలో ఆమె చూపించిన భావోద్వేగ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ ప్రయాణం ఆమె ఒక నటిగా ఎలా పరిణామం చెందిందో స్పష్టంగా తెలియజేస్తోంది. ప్రస్తుతం కాక్‌టెయిల్ 2 చిత్రంలో నటించనుంది. తన కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకుంటూ అవకాశాల ప్రాధాన్యాన్ని వివరించింది.
అదృష్టంపై నమ్మకం ఉంది..
విజయంలో టైమింగ్, అవకాశాల పాత్రపై స్పందించింది. ‘నాకు అదృష్టంపై నమ్మకం ఉంది. డెస్టినీ కూడా ముఖ్యమే. కానీ కష్టపడటం, ప్రతిభ, అదృష్టం ఈ మూడు కలిసినప్పుడే నిజమైన ఫలితం వస్తుంది. అంతేకాదు, మన ముందుకు వచ్చే అవకాశాలను గుర్తించడం కూడా చాలా అవసరం. కొన్ని అవకాశాలు మన దృష్టికి రాకుండా వెళ్లిపోవచ్చు. వాటిని గుర్తించి పట్టుకోవడానికి ధైర్యం ఉండాలి’ అని ఆమె పేర్కొంది. ఇంకా మాట్లాడుతూ ‘కొన్ని సందర్భాల్లో రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. మనకు భయం వేసే నిర్ణయాలైనా తీసుకోవాలి. ఆ భయాన్ని దాటుకుని ముందడుగు వేయడం చాలా ముఖ్యం. అలాంటి ధైర్యమే మనకు వచ్చిన అవకాశాలను నిజంగా ఉపయోగించుకునేలా చేస్తుంది’ అంటూచెప్పుకొచ్చింది. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కృతి సనన్ కాక్‌టెయిల్2 మూవీలో నటించనుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. రష్మిక మందన్నా, షాహిద్ కపూర్ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. కాక్‌టెయిల్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ ఏడాది జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



