Kriti Sanon | లెస్బియన్‌గా మహేష్‌బాబు హీరోయిన్ – ఇద్దరు హీరోయిన్ల ప్రేమకథతో బాలీవుడ్ సీక్వెల్
కృతి సనన్, రష్మిక మందన్న హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 లెస్బియన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. రష్మిక, కృతిసనన్ స్వలింగ సంపర్కులుగా కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Feb 19, 2026, 3.20 pm IST
Kriti Sanon | ప్రస్తుతం బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు అన్ని ఇండస్ట్రీలలో సీక్వెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలు నటించిన పలు సూపర్ హిట్ సినిమాలకు సీక్వెల్స్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సీక్వెల్స్ సినిమాల్లో కాక్ టెయిల్ 2 కూడా ఒకటి. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే జంటగా నటించిన కాక్ టెయిల్ మూవీ 2012లో రిలీజై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా డైరెక్టర్ హోమీ అద్జానియా ఈ సినిమాను తెరకెక్కించారు.
14 ఏళ్ల తర్వాత...
పధ్నాలుగేళ్ల తర్వాత కాక్‌టెయిల్ 2 మూవీకి సీక్వెల్ రాబోతుంది. ఈ సీక్వెల్‌లో షాహిద్‌కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కాక్‌టెయిల్‌ను తెరకెక్కించిన డైరెక్టర్ హోమీ అద్జానియా ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సీక్వెల్ షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.
లెస్బియన్ కపుల్...
లెస్బియన్ లవ్‌స్టోరీతో కాక్ టెయిల్ 2 తెరకెక్కుతోన్నట్లు బాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇందులో రష్మిక మందన్న, కృతి సనన్ లెస్బియన్ కపుల్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఇద్దరమ్మాయిల మధ్య ఏర్పడిన పరిచయం ఎలా ప్రేమబంధంగా మారిందని, వారి మధ్యలోకి ఓ యువకుడు ఎలా వచ్చాడనే పాయింట్ చుట్టూ ఈ సీక్వెల్ కథ సాగుతోందని అంటున్నారు.
పోస్టర్లు లీక్...
ఈ సినిమా నుంచి ఇప్పటివరకు లీకైన ఫొటోల్లో రష్మిక మందన్న, కృతి సనన్ చాలా క్లోజ్‌గా కనిపించారు. వారిద్దరి ఇంటిమేట్ పోస్టర్లు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ పోస్టర్స్‌తో వీరిద్దరు స్వలింగ సంపర్కులుగా కనిపించనున్నది నిజమేనని అంటున్నారు. రష్మిక, కృతి సనన్ క్యారెక్టర్స్ ఛాలెంజింగ్‌గా ఉంటాయట.
అచ్చిరాలేదు...
లెస్బియన్ కాన్సెప్ట్ బాలీవుడ్‌కు అంతగా అచ్చిరాలేదు. ఈ తరహా కథాంశాలతో గతంలో హిందీలో బదాయ్ హో, ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగాతో పాటు మరికొన్ని సినిమాలు వచ్చాయి. ఆడియెన్స్‌ను మాత్రం ఈ సినిమాలను పెద్దగా పట్టించుకోలేదు. దాంతో కాక్ టెయిల్ 2 రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
తెలుగు సినిమాలతో...
కాక్ టెయిల్ 2 మూవీ సెప్టెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సీక్వెల్‌లో నటిస్తున్న రష్మిక మందన్న, కాక్ టెయిల్ 2 ఇద్దరూ తెలుగు సినిమాలతోనే స్టార్స్‌గా మారారు. మహేష్‌బాబు వన్ నేనొక్కడినే మూవీతోనే కృతి సనన్ యాక్టింగ్ జర్నీ మొదలైంది. పుష్ప, పుష్ప 2, గీతగోవిందంతో పాటు మరికొన్ని టాలీవుడ్ బ్లాక్‌బస్టర్స్‌తో రష్మిక పాన్ ఇండియన్ హీరోయిన్‌గా మారింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



