త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kiara Advani | న‌దియా ప్రత్యేకం.. టాక్సిక్ మూవీపై కియారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!

Kiara Advani | క‌న్నడ స్టార్ న‌టుడు య‌శ్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ టాక్సిక్‌. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నది. ఈ మూవీలో న‌దియా పాత్ర గురించి ఓ ఇంట‌ర్య్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది.

P

Entertainment | Published On Apr 1, 2026, 9.15 pm IST

Kiara Advani | న‌దియా ప్రత్యేకం.. టాక్సిక్ మూవీపై కియారా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..!
Advertisement

Kiara Advani | క‌న్నడ స్టార్ న‌టుడు య‌శ్ హీరోగా తెర‌కెక్కుతున్న మూవీ టాక్సిక్‌. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కీల‌క‌పాత్రలో న‌టిస్తున్నది. ఈ మూవీలో న‌దియా పాత్ర గురించి ఓ ఇంట‌ర్య్వూలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ద‌ర్శకురాలు గీతు మోహ‌న్ దాస్ త‌న‌కు ఇచ్చిన పాత్ర చాలా ప్రత్యేక‌మని, ఎన్నో స‌వాళ్లు ఉంటాయ‌ని తెలిపింది. ‘నేను ఈ పాత్రలో సరిపోతానా అని ఆలోచించాను. నిజంగా సాధ్యమేనా అని ప్రశ్నలు ఎదుర‌య్యాయి’ అని కియారా తెలిపింది. ఇంకా మాట్లాడుతూ ‘ఈ పాత్ర గురించి స్క్రిప్ట్ చ‌దివిన‌ప్పుడు ప్రత్యేకమ‌ని అనిపించింది.

గ‌తంలో ఇలాంటి పాత్ర గురించి చ‌దివింది, విన్నది లేదు. ఈ రోల్‌ గురించి విని థ్రిల్ అయ్యాను. ఈ పాత్ర కోసం త‌న‌కు తాను మార్పులు చేసుకున్నాను. ఈ అవ‌కాశం వ‌చ్చినందుకు సంతోషంగా ఉంది’ అని చెప్పింది. వైర‌ల్ అవుతున్న వీడియో పాత‌దే అయినా ప్రస్తుతం నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ మూవీ ఈ ఏడాది జూన్ 4న విడుద‌ల కానుంది. ప‌లు భార‌తీయ భాష‌ల‌తో పాటు ప్రపంచ‌వ్యాప్తంగా ఒకేసారి విడుద‌ల చేయ‌నున్నారు. ఇప్పటికే విడుద‌లైన రెండు టీజ‌ర్లు మూవీపై భారీ అంచ‌నాలు పెంచాయి. ఈ మూవీలో య‌శ్‌ రాయ, టికెట్ అనే రెండు పాత్రల్లో క‌నిపించ‌నున్నట్లు స‌మాచారం. ఈ మూవీ నుంచి త‌బాహి అనే పాట‌ను ఈ నెల రెండోవారంలో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Advertisement
Advertisement