త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | నెట్టింట కాయదు ఫొటో వైరల్‌.. ఇలా ఎందుకు చేస్తారో తెలియడం లేదన్న ఫంకీ బ్యూటీ..!

Kayadu Lohar | యువతలో మంచి క్రేజ్ సంపాదిస్తున్న నటి కాయదు లోహర్‌. ఈ అసోం బ్యూటీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. బాయ్‌కట్‌ హెయిర్‌ స్టయిల్‌ ఫొటోను చూసి అభిమానులంతా షాక్‌ అయ్యారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఏఐతో తయారు చేసిందేనని స్పష్టం చేసింది.

P

Entertainment | Published On Apr 1, 2026, 3.29 pm IST

Kayadu Lohar | నెట్టింట కాయదు ఫొటో వైరల్‌.. ఇలా ఎందుకు చేస్తారో తెలియడం లేదన్న ఫంకీ బ్యూటీ..!
Advertisement

Kayadu Lohar | యువతలో మంచి క్రేజ్ సంపాదిస్తున్న నటి కాయదు లోహర్‌. ఈ అసోం బ్యూటీ ఫొటో ఒకటి నెట్టింట వైరల్‌ అయ్యింది. బాయ్‌కట్‌ హెయిర్‌ స్టయిల్‌ ఫొటోను చూసి అభిమానులంతా షాక్‌ అయ్యారు. ఇందులో ఎలాంటి వాస్తవం లేదని, ఏఐతో తయారు చేసిందేనని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తరచూ తన ఫొటోలు, అప్‌డేట్స్‌తో ట్రెండ్ అవుతూ ఉండే కయాదు లోహర్ ఇటీవల విశ్వక్‌సేన్‌ సరసన తెలుగులో ఫంకీ మూవీలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించకపోయినా.. కయాదు తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రశంసలు అందుకుంది. మోడలింగ్ రంగం ద్వారా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కయాదు లోహర్ తక్కువ సమయంలోనే యూత్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకుంది. స్టయిలిష్‌ లుక్స్‌, సోషల్ మీడియా యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోలను అప్‌డేట్‌ చేస్తూ వస్తుంది. ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో భారీ ఫాలోయింగ్‌ ఉంది. ఫ్యాషన్, ఫొటోషూట్స్‌తో పాటు, విభిన్న పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

ఇటీవల ఆమె బాయ్‌కట్ హెయిర్‌స్టైల్‌లో ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఈ లుక్‌ను చూసిన అభిమానులు షాక్‌ అయ్యారు. కొత్త ప్రాజెక్ట్ కోసం హెయిర్‌కట్‌ చేయించుకొని ఉండవచ్చని భావించారు. ఫేక్‌ ఫొటోలపై ఎట్టకేలకు స్పందించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న ఫొటోలు నిజం కాదని తేల్చిచెప్పింది. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఎడిట్ చేసినదేనని పేర్కొంది. అలాంటి ఫొటో ఎందుకు సృష్టించి వైరల్ చేశారో అర్థం కావడం లేదని ఆమె వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కయాదు లోహర్ చేతిలో ఓ తెలుగు చిత్రంతో పాటు తమిళం, మలయాళ సినిమాలున్నాయి.

వరుస ప్రాజెక్టులతో కెరీర్‌లో ఫుల్‌ బిజీగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించాలని ఆమె లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కాయదు తెలుగులో నాని సరసన ‘ది ప్యారడైజ్‌’ మూవీలో నటిస్తోంది. అదే సమయంలో మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా పల్లిచట్టంబిలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ విడుదల సిద్ధమైంది. పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇటీవల టీజర్‌ రిలీజ్‌ కాగా.. మూవీపై అంచనాలు పెంచింది. మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు సమాచారం. అలాగే, మలయాళంలోనే ఐ యామ్‌ గేమ్‌ మూవీలో నటిస్తోంది. దుల్కర్‌ సల్మాన్‌కు జోడీగా కనిపించనుంది. అలాగే, ఫ్యామిలీ డ్రామా ‘తారం’ మూవీలోనూ కీలకపాత్రలో నటిస్తోంది. తమిళంలో ఇమ్మోర్టల్‌, ఇదయం మురళి చిత్రాలతో ఫుల్‌ బిజీగా ఉంది.

Advertisement
Advertisement