Janhvi Kapoor | ఇండస్ట్రీలో అదో పెద్ద సమస్య.. జాన్వీ కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
Janhvi Kapoor | సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దోపిడీపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆందోళన వ్యక్తం చేసింది. సినిమాల్లో మహిళా పాత్రల సెన్సువాలిటీని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడింది.
Entertainment | Published On Apr 15, 2026, 1.00 pm IST
Janhvi Kapoor | సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న దోపిడీపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఆందోళన వ్యక్తం చేసింది. సినిమాల్లో మహిళా పాత్రల సెన్సువాలిటీని చాలా సందర్భాల్లో తప్పుగా అర్థం చేసుకుంటున్నారని ఆమె అభిప్రాయపడింది. తాను కొన్ని పాత్రలు, సన్నివేశాలకు కనిపించేందుకు అంగీకరించడం వాటిని అనవసరంగా, మరోలా చూపించేందుకు అనుమతి ఇచ్చినట్టుకాదని ఆమె స్పష్టం చేసింది. జూమ్ షాట్లు, స్లో మోషన్ ఎడిట్స్, అలాగే ఏఐ టూల్స్ ఉపయోగించి కంటెంట్‌ను వక్రీకరించడం మహిళా నటీమణులను అసురక్షిత పరిస్థితుల్లోకి నెడుతున్నదని వాపోయింది.
అలాగే, ఒక నటుడు, నటి కొన్ని సన్నివేశాల్లో, దుస్తుల్లో కనిపించేందుకు అంగీకరించినంత మాత్రాన వాటిని వేరే అర్థం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం సరైనది కాదని జాన్వీ పేర్కొన్నారు. పబ్లిక్‌లో కనిపించే ప్రతి కంటెంట్‌ను దుర్వినియోగానికి ఉపయోగించవచ్చని భావించే ధోరణి సమాజంలో పెరుగుతోందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి మహిళా నటుల పట్ల గౌరవం తగ్గించేలా మారుతోందని చెప్పింది. తాను విభిన్న పాత్రలు చేస్తూ ముందుకు సాగుతున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలను సందర్భం తప్పుగా చూపిస్తూ సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారని ఆమె తెలిపింది. అంతేకాకుండా పాపరాజీలు తీసిన ఫోటోలను కూడా ఎడిట్ చేసి అనుచితంగా ప్రచారం చేస్తున్న సందర్భాలు ఉన్నాయని పేర్కొంది.
ఈ అనుభవాలే తనకు ఈ అంశంపై గట్టి అభిప్రాయాలు ఏర్పడటానికి కారణమని జాన్వీ వెల్లడించింది. సినీ పరిశ్రమలో ఇది ఒక పెద్ద సమస్యగా మారిందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలపై అభిమానులు మద్దతు తెలియజేస్తూ, ఇలాంటి సున్నితమైన అంశాన్ని బహిరంగంగా ప్రస్తావించినందుకు ఆమెను ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం జాన్వీ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన పెద్ది మూవీలో నటిస్తోంది. ఈ సినిమాలో గ్రామీణ యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్‌లో ఆలస్యం కారణంగా రిలీజ్ వాయిదాపడింది. ఎన్టీఆర్ సరసన దేవర మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. దేవర-2 మూవీలోనూ నటించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కనుందో తెలియడం లేదు. త్వరలోనే సినిమా షూటింగ్ మొదలవుతుందని నిర్మాత ప్రకటించినా.. ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



