Tamannaah Bhatia | తమన్నా రిస్క్ చేస్తోందా..? స్పెషల్ సాంగ్ కోసం కెరీర్‌నే పణంగా పెడుతోందా..?
Tamannaah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది.
Entertainment | Published On May 6, 2026, 9.00 pm IST
Tamannaah Bhatia | మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతోంది. ఒకవైపు హీరోయిన్‌గా సినిమాల్లో నటిస్తూనే, మరోవైపు స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకుల్లో తన క్రేజ్‌ను సొంతం చేసుకుంటోంది. గతంలో హీరోయిన్‌లు ఐటమ్ సాంగ్స్ చేయడం కెరీర్‌కు రిస్క్‌గా భావించేవారు. కానీ ఆ అభిప్రాయం ఇప్పుడు మారిపోయింది. తమ్మన్నా చేస్తున్న స్పెషల్ సాంగ్స్ ఆమెకు కొత్త అవకాశాలు తెస్తున్నాయి. ఇటీవల జైలర్, స్త్రీ 2, రైడ్ 2, జై లవకుశ సినిమాల్లో చేసిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉండగా టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో ప్రస్తుతం తమ్మన్నా పేరు మరోసారి చర్చలోకి వచ్చింది.
ఓ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో స్పెషల్ సాంగ్ కోసం ఈ బ్యూటీని తీసుకునే అంశంపై చర్చలు జరుపుతున్నట్లుగా సినీ వర్గాల సమాచారం. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న కల్‌నాయక్ రీమేక్‌లో సూపర్ హిట్ సాంగ్ ‘చోళీకి పీచే క్యా హే’ సాంగ్‌ను సైతం మళ్లీ బిగ్ స్క్రీన్‌పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఆధునిక సాంకేతికతతో ఈ పాటను చిత్రీకరించే యోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. ఈ పాట కోసం తమ్మన్నా పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పాటకు సినిమాల్లో చాలా ప్రత్యేక స్థానం ఉంది. అసలు వెర్షన్‌లో మాధురి దీక్షిత్ నటించిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ ఇప్పటికే ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. డ్యాన్స్, హావభావాలు, తెరపై సహజ ఆకర్షణ ఈ పాటను క్లాసిక్‌గా నిలిపాయి.
ఈ నేపథ్యంలో రీమేక్ వార్త వెలుగులోకి రావడంతో చర్చ సాగుతోంది. తమ్మన్నా ప్రస్తుతం వరుసగా స్పెషల్ సాంగ్స్‌లో కనిపిస్తుండటంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెను పూర్తి గ్లామర్ సాంగ్స్‌కే పరిమితం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మిల్క్ బ్యూటీలోని నటిని సరిగా ఉపయోగించుకోవడం లేదనే అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో సూపర్ హిట్ సాంగ్‌ను మళ్లీ చేయడం సవాలేనని సినీ వర్గాలు చెబుతున్నాయి. కొత్త వెర్షన్‌లో విజువల్స్, డాన్స్ ఎనర్జీపై ఎక్కువ దృష్టి పెట్టినా, అసలు పాటలోని సహజత్వాన్ని అందుకోవడం కష్టమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఫ్యాన్స్‌లో కూడా ఈ అంశంపై భిన్న స్పందనలు కనిపిస్తున్నాయి. తమ్మన్నా ఇలాంటి క్లాసిక్‌ను రీమేక్‌లో నటించాలనే రిస్క్‌తో కూడుకున్న నిర్ణయమని భావిస్తున్నారు. వరుసగా స్పెషల్ సాంగ్స్‌లో వరుసగా కనిపిస్తుండడంతో కెరీర్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



