Prashant Tamang | ఇండియన్ ఐడల్ విన్నర్, బాలీవుడ్ నటుడు ప్రశాంత్ తమంగ్ గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. ఢిల్లీలోని స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 2007లో టెలికాస్ట్ ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో విజేతగా నిలవడంతో ప్రశాంత్ తమంగ్ పేరు బాలీవుడ్‌లో మారు మోగింది. ఈ సింగింగ్ రియాలిటీ షో కంటే ముందు కోల్‌కతా పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్‌గా చాలా కాలం పాటు పనిచేశారు ప్రశాంత్. ఓ వైపు జాబ్ చేస్తూనే సింగర్‌గా కొనసాగారు. సింగర్...యాక్టర్... ఇండియన్ ఐడల్ విజేతగా నిలవడంతో బాలీవుడ్‌లో సింగర్‌గా, యాక్టర్‌గా అవకాశాలు దక్కించుకున్నారు ప్రశాంత్ తమంగ్. 2010లో రిలీజైన నేపాలీ మూవీ గోర్ఖా ఫల్టాన్ సినిమాలో హీరోగా కనిపించాడు. అంగాలో యో మాయా కో, కినా మాయా నా, నిషాని, పర్‌దేశీతో పాటు పలు నేపాలీ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్‌లో అగ్ర హీరోల సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశారు. గత ఏడాది రిలీజైన పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌లో డానియెల్ అనే క్యారెక్టర్‌లో ప్రశాంత్ తమంగ్ అద్వితీయ నటనతో ఆకట్టుకున్నారు. ఇండియాలో కంటే నేపాల్‌లో ప్రశాంత్ తమంగ్‌కు ఎక్కువగా అభిమానులు ఉన్నారు. గుర్ఖా కమ్యూనిటీ కోసం చాలా పాటు పడ్డారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న బ్యాటిల్ ఆఫ్ గాల్వన్‌లో కీలక పాత్రలో న టిస్తున్నాడు. ఇటీవలే ప్రశాంత్ తమంగ్‌కు పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ప్రశాంత్ తమంగ్‌కు భార్య గీతా తాపతో పాటు కూతురు అరియా ఉన్నారు.