Indian 3 | శంకర్ కొత్త ప్రాజెక్ట్ వైపు అడుగులు..! లోకనాయకుడు ఇండియన్ ఫ్రాంచైజీకి బ్రేక్..?
Indian 3 | లోక నాయకుడు కమల్ హసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్ శంకర్ (S Shankar) తెరకెక్కించిన ఇండియన్-2 (Indian 2). ఈ మూవీ 2024 జూలై 12న థియేటర్లలో విడుదలైంది.
Entertainment | Published On Mar 9, 2026, 9.01 pm IST
Indian 3 | లోక నాయకుడు కమల్ హసన్ (Kamal Haasan) ప్రధాన పాత్రలో దర్శకుడు ఎస్ శంకర్ (S Shankar) తెరకెక్కించిన ఇండియన్-2 (Indian 2). ఈ మూవీ 2024 జూలై 12న థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకులు, విమర్శలకు నుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో ఈ ఫ్రాంచైజీ భవిష్యత్తుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి మొదట ఈ కథను ఒకేసారి విడుదల చేయాలని భావించారు. నిడివి ఎక్కువగా ఉండడంతో కథను రెండు భాగాలుగా విడదీయాలని మేకర్స్ నిర్ణయించారు. దాంతో కొంత అదనంగా ఫుటేజీని జోడించి ఇండియన్-2 మూవీలో రిలీజ్ చేశారు. మూవీ చివరలో ఇండియన్-3 మూవీ కూడా ఉంటుందని టీజర్‌ని చూపించారు.
అయితే, ఇండియన్-2 ఆశించిన విషయాన్ని అందుకోకలేకపోయింది. ముఖ్యంగా నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions)కు భారీ నష్టాలు రావడంతో ఇండియన్-3 ప్రాజెక్ట్ నిలిచిపోయింది. కొంత చిత్రీకరణ మిగిలి ఉండగా.. తాత్కాలికంగా వాయిదా వేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ మూవీ విడుదలపై ఇంకా స్పష్టత లేదు. కొద్దిరోజుల కిందట శంకర్ మళ్లీ షూటింగ్ ప్రారంభించి ఇండియన్-3 తర్వగానే పూర్తి చేస్తారని ప్రచారం జరిగింది. అయితే, తర్వాత ఆయన ప్రతిష్ఠాత్మకమైన చారిత్రక ప్రాజెక్ట్ ‘వేళ్పారి’పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను చాలా భారీ స్థాయిలో రూపొందించాలనే ఆలోచనలో ఆయన ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. లైకా ప్రొడక్షన్‌కు తన కొత్త ప్రాజెక్ట్ వేళ్పారిని ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన ఉన్నట్లు శంకర్ తెలిపినట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అయితే, ఇండియన్-3 మూవీని పూర్తి చేయాలా వద్దా అనే నిర్ణయాన్ని తీసుకునేందుకు నిర్మాతలకు కొంత సమయం ఇచ్చినట్లు సమాచారం. మేకర్స్ నిర్ణయం తీసుకోకపోతే శంకర్ నేరుగా తన కొత్త ప్రాజెక్ట్ పనులు ప్రారంభించే అవకాశం ఉంది.
ఆ సినిమా భారీ ప్రాజెక్ట్ కావడంతో చాలాకాలం పట్టే అవకాశం ఉంది. దాంతో ఇండియన్-3 మూవీ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందనే విషయం తెలియనది సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కమల్ మూవీపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. పలువురు అభిమానులు ఇండియన్-3 మూవీని పూర్తి చేయాలని శంకర్‌కు సూచిస్తున్నారు. లేకపోతే నిర్మాతలకు మరింత ఆర్థిక నష్టం జరుగుతుందని పేర్కొంటున్నారు. మరికొందరు మాత్రం ఇండియన్-2 రిజల్ట్ తర్వాత ఈ ఫ్రాంచైజీపై ఆసక్తి తగ్గిపోయిందని మరికొందరు పేర్కొంటున్నారు. మళ్లీ మరో భాగం కోసం భారీ పెట్టుబడి పెట్టడం ఏమాత్రం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మాత్రం ఈ ప్రాజెక్ట్ భవిష్యత్తుపై ఎలాంటి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో శంకర్ ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తారా? తన కొత్త ప్రాజెక్ట్‌పై దృష్టి పెడతారా? అన్నది వేచి చూడాల్సిందే.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






