Actress Divyanka | సినీ ఇండస్ట్రీలో విషాదం.. 30 ఏళ్ల వయసులో గుండెపోటుతో యువనటి మృతి..!
Actress Divyanka | హర్యాన్వీ నటి దివ్యాంక సిరోహి (30) గుండెపోటుతో మృతి చెందింది. ఉత్తరప్రదేశ్‌లోని తన ఇంట్లో ఉన్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Entertainment | Published On Apr 22, 2026, 7.06 pm IST
Actress Divyanka | సినిమా ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది. యువ హర్యాన్వీ నటి దివ్యాంగ సిరోహి (30) గుండెపోటుతో కన్నుమూసింది. మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌లోని తన నివాసంలో ఉన్న సమయంలో ఆమె అకస్మాత్తుగా కుప్పకూలినట్లు సమాచారం. వెంటనే కుటుంబ సభ్యులు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ వైద్యులు ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. దివ్యాంక సిరోహి మరణంపై కుటుంబ సభ్యుల నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ వార్త తెలిసిన కుటుంబ సభ్యులు, సన్నిహితులు షాక్‌కు గురయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌కు చెందిన దివ్యాంక ప్రస్తుతం తల్లిదండ్రులు, నానమ్మతో కలిసి ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు. ఆమె చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీలో బీసీఏ పూర్తిచేసి, అనంతరం సిక్కింలో ఎంబీఏ పూర్తి చేసింది. ఆమెకు సోదరుడు హిమాన్షు, అక్కలు దీపాంశు, జస్మీత్ ఉన్నారు.
సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందిన దివ్యాంక, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందింది. గాయకుడు మసూం శర్మతో కలిసి పలు పాటల్లో నటించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్లకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. టిక్‌టాక్‌లో వీడియోలతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్ననాటి నుంచే యాక్టింగ్, ఆసక్తి ఉన్నట్లు ఒక ఇంటర్వ్యూలో తెలిపింది. ఆమె చివరి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ మార్చి 19న చేసింది. అందులో బ్లూ-వైట్ ఫ్లోరల్ డ్రెస్‌లో కనిపిస్తూ బీ ప్రాక్, అఫ్సానా ఖాన్ సాంగ్ ‘బర్సానా మిలా హై’కు డ్యాన్ చేసిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న తరుణంలో గుండెపోటుతో మృతి చెందింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Asian Games | ఆసియా గేమ్స్‌లో దాయాదుల సమరం.. అక్టోబర్ 1న హైవోల్టేజ్ మ్యాచ్
సెప్టెంబర్ 28, 2026

Esha Singh | షూట్ఆఫ్స్లో అదరగొట్టిన ఈషా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..
సెప్టెంబర్ 28, 2026

Nidhi Tiwari Suicide | ఇన్‌స్టాలో లక్షల మంది ఫాలోవర్స్.. ఇన్ఫ్లుయెన్సర్ నిధి తివారీ సూసైడ్: ఆ ఫోన్ సంభాషణ తర్వాతే తీవ్ర నిర్ణయం
సెప్టెంబర్ 28, 2026
తాజావార్తలు
- ●Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్
- ●Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు
- ●Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..
- ●Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి
- ●Esha Singh | షూట్ఆఫ్స్లో అదరగొట్టిన ఈషా.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో పతకం..
- ●Delhi Pollution | పార్కింగ్ ఛార్జీలు రెట్టింపు, 50% సిబ్బందికి వర్క్‌ఫ్రమ్ హోమ్.. శీతాకాలానికి సిద్ధమవుతున్న ఢిల్లీ

Ashika Ranganath | ఏజ్ గ్యాప్‌పై ట్రోల్స్ - అజిత్ సినిమా నుంచి శ్రీలీల ఔట్ - కన్నడ బ్యూటీకి ఛాన్స్

Supreme Court | టీఎంసీ పార్టీ గుర్తు, పేరుపై వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీం కీలక ఆదేశాలు

Stock Markets | రూ.6 లక్షల కోట్లు ఆవిరి.. స్టాక్ మార్కెట్లలో వాటర్ ఫాల్.. భారీగా అమ్మకాలు..

Congress Leaders Rally | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలి



