త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hansika Motwani | కాస్టింగ్ కౌచ్ హ‌న్సిక కామెంట్స్‌.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల వెల్లువ..!

Hansika Motwani | సినీ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా వినిపించే ప‌దం కాస్టింగ్ కౌచ్‌. ఇప్ప‌టికే ఎంద‌రో న‌టీమణులు త‌మ‌కు ఎదురైన వేధింపుల‌పై గ‌ళం విప్పారు. తాజాగా హీరోయిన హన్సికా మోత్వానీ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

P

Entertainment | Published On Apr 20, 2026, 4.49 pm IST

Hansika Motwani | కాస్టింగ్ కౌచ్ హ‌న్సిక కామెంట్స్‌.. సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌ల వెల్లువ..!
Advertisement

Hansika Motwani | సినీ ఇండ‌స్ట్రీలో ఎక్కువ‌గా వినిపించే ప‌దం కాస్టింగ్ కౌచ్‌. ఇప్ప‌టికే ఎంద‌రో న‌టీమణులు త‌మ‌కు ఎదురైన వేధింపుల‌పై గ‌ళం విప్పారు. తాజాగా హీరోయిన హన్సికా మోత్వానీ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు అలాంటి అనుభవమే ఎదురుకాలేదంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హ‌న్సిక‌కు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ప్ర‌శ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. “పని చేయాలనుకునే వారికి అలాంటి పరిస్థితులు ఎదురవుతాయని నేను అనుకోవడం లేదు.

నాకు అలాంటి అనుభవ‌మేమీ ఎదురుకాలేదు. కాబట్టి ఆ కోణంలోనే మాట్లాడుతున్నాను. నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు తెలియదు. కాబట్టి ఏమీ వ్యాఖ్యానించలేను” అని చెప్పుకొచ్చింది. దీనిపై టీవీ నటి శ్వేతా గులాటి “ఇంకోకరు తమ సొంత ప్రపంచంలోనే జీవిస్తున్నారు” అంటూ వ్యాఖ్యానించారు. ప‌లువురు నెటిజ‌న్స్ సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌న్సిక‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌కు అలా జ‌రుగ‌లేద‌ని, కాబ‌ట్టి అని నిజం కాద‌ని అనుకోవ‌డం స‌రికాద‌న్నారు. ఎవ‌రైనా నిర్మాత‌ను చూసిన వెంట‌నే మంచి, చెడు ఎలా నిర్ణ‌యిస్తార‌ని మ‌రో యూజ‌ర్ ప్ర‌శ్నించారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. తాను ఎప్పుడూ ఆస్ట్రేలియాకు వెళ్ల‌లేద‌ని.. అందుకే ఆ దేశం లేద‌ని అనుకోవ‌చ్చా? అంటూ కామెంట్ చేశాడు.

హ‌న్సిక కెరీర్‌..

బాలనటిగా కెరీర్ ప్రారంభించింది హ‌న్సిక‌. ష‌క‌ల‌క భుమ్ భుమ్ త‌దిత‌ర సీరియ‌ల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. కోయి మిల్‌గ‌యా మూవీలోనూ న‌టించింది. ఆ త‌ర్వాత తెలుగులో దేశముదురు మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలువ‌డంతో వ‌రుసగా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టిస్తూ కెరీర్‌లో బిజీగా మారింది. తెలుగుతో పాటు త‌మిళంలోనూ న‌టించింది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే హన్సిక 2022లో వ్యాపారవేత్త సోహ‌ల్‌ను పెళ్లి చేసుకుంది. కొద్దిరోజుల‌కే ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు త‌లెత్తాయి. ఇద్ద‌రు విడాకులు తీసుకొని విడిపోయిన విష‌యం తెలిసిందే.

Advertisement
Advertisement