Golden Globe Winners | గోల్డెన్ గ్లోబ్ విన్నర్స్ వీళ్లే – స్పెషల్ అట్రాక్షన్‌గా ప్రియాంక చోప్రా
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక ఆదివారం లాస్ ఎంజిలాస్‌లోని బ్లెవర్లీ హిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బాటిల్ ఆఫ్టర్ అనదర్ మూవీతో పాటు అడోలోసెన్స్ సిరీస్ సత్తా చాటాయి. తలో నాలుగు అవార్డులు అందుకున్నాయి.
Entertainment | Published On Jan 12, 2026, 4.58 pm IST
Golden Globe Winners | 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక హాలీవుడ్ తారల తళుకు బెళుకుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం లాస్ ఏంజిలాస్‌లోని ది బేవర్లీ హిల్టన్ ఈ వేడుకకు ఆతిథ్యాన్ని చ్చింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో లియోనార్డో డికాప్రియో మూవీ వన్ బ్యాటిల్ అఫ్టర్ అనదర్ నాలుగు అవార్డులతో సత్తా చాటింది. నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అడోలెసెన్స్ గోల్డెన్ గ్లోబ్‌లో మెరిసింది. ఈ సిరీస్ నాలుగు అవార్డులను అందుకుంది. అడోలెసెన్స్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన ఓవెన్ కూపర్ గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న అతి పిన్న వయస్కుడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేతల జాబితా...
డ్రామా కేటగిరీలో...
బెస్ట్ మూవీగా మ్యామ్నెట్ , బెస్ట్ యాక్టర్‌గా వాగ్నర్ మౌరా, బెస్ట్ నటిగా జెస్సీ బక్లీ అవార్డులు అందుకున్నారు.
మ్యూజికల్ కామెడీ విభాగంలో ఉత్తమ సినిమాగా వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ అవార్డును గెలుచుకుంది. ఈ కేటగిరీలో టీమోతీ చాలమెట్ ఉత్తమ నటుడిగా...రోజ్ బైర్స్ ఉత్తమ నటిగా అవార్డులు సొంతం చేసుకున్నారు.ఈ సినిమాకు గాను బెస్ట్ డైరెక్టర్ అవార్డు పాల్ థామస్ అండర్సన్‌కు దక్కింది. బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్ మూవీగా ది సీక్రెట్ ఏజెంట్ ఎంపికైంది.
అడోలెసెన్స్ వెబ్ సిరీస్....
టీవీ అవార్డుల్లో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అడోలెసెన్స్‌కు ఎక్కువగా అవార్డులు దక్కాయి. బెస్ట్ మిని సిరీస్ తో పాటు బెస్ట్ యాక్టర్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్, ఫిమేల్ విభాగాల్లో ఈ సిరీస్‌కు అవార్డులు దక్కాయి. ఓ హత్య నేరంలో అరెస్ట్ అయిన పదమూడేళ్ల బాలుడి జీవితం నేపథ్యంలో అడోలెసెన్స్ సిరీస్ సాగుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో హయ్యెస్ట్ వ్యూస్‌ను దక్కించుకున్న సిరీస్‌గా అడోలెసెన్స్ నిలిచింది.
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మెరిసింది. భర్త నిక్ జోనస్‌తో కలిసి ఈ ఈవెంట్‌లో పాల్గొన్నది. రెడ్ కార్పెట్‌పై భర్తతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చింది. అంతే కాకుండా పలువురు విజేతలకు అవార్డులను అందజేసింది. జెన్నిఫర్ లారెన్స్, సెలీనా గోమెజ్, ఎమిలీ బ్లెంట్, అరియానా గ్రాండే , జార్జ్ క్లూనీ, స్నూప్ డాగ్, మైలీ సైరస్‌తో పలువురు హాలీవుడ్ సెలిబ్రిటీలు ఈ ఈవెంట్‌లో సందడి చేశారు. నిక్కీ గ్లేజర్ గోల్డెన్ గ్లోబ్‌కు హోస్ట్‌గా వ్యవహరించారు.
సంబంధిత వార్తలు

Priyanka Chopra | పాకిస్థానీ దిగ్గజ నటి పాత్రలో ప్రియాంక చోప్రా.. ఫస్ట్ ఐటెమ్ గర్ల్‌గా గ్లోబల్ స్టార్
మే 14, 2026

Priyanka Chopra | దళపతి విజయ్ క్రేజ్ అప్పుడే తెలిసింది – డెబ్యూ మూవీ అనుభవాలపై ప్రియాంక చోప్రా కామెంట్స్
మే 11, 2026

Priyanka Chopra | హాలీవుడ్ సినిమాకు ప్రొడ్యూసర్‌గా ప్రియాంక చోప్రా…
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



