Horror OTT | ఓటీటీలోకి వచ్చిన సోనాక్షి సిన్హా హారర్ మిస్టరీ మూవీ – బుక్‌లోని దయ్యాలు వెంటపడితే
సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ హారర్ మిస్టరీ మూవీ నికితా రాయ్ ఓటీటీలోకి వచ్చింది. సోమవారం జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ రిలీజైంది. ఈ హారర్ సినిమాకు సోనాక్షి సిన్హా సోదరుడు కుశ్ సిన్హా దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Jan 12, 2026, 8.01 pm IST
Horror OTT | సోనాక్షి సిన్హా హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ నికితా రాయ్ గత ఏడాది థియేటర్లలో రిలీజైంది. మిస్టరీ హారర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు సోనాక్షి సిన్హా సోదరుడు కుశ్ సిన్హా దర్శకత్వం వహించాడు. థియేటర్లలో ఫెయిల్యూర్‌గా నిలిచిన ఈ మూవీ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది.
జియో హాట్ స్టార్...
సోమవారం జియో హాట్‌స్టార్‌లో నికితారాయ్ మూవీ రిలీజైంది. ఎలాంటి ముందస్తు అనౌన్స్‌మెంట్ లేకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చి అభిమానులను సర్‌ప్రైజ్ చేసింది. నికితారాయ్ మూవీలో పరేష్ రావల్, సోహైల్ నయ్యర్ కీలక పాత్రలు పోషించారు. భగవంత్ కేసరి ఫేమ్, బాలీవుడ్ సీనియర్ నటుడు అర్జున్ రాంపాల్ అతిథి పాత్రలో నటించాడు. నికితా రాయ్ మూవీతోనే సోనాక్షి బ్రదర్ కుశ్ సిన్హా డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
దాదాపు ఇరవై ఐదు కోట్ల బడ్జెట్‌తో నికితా రాయ్ మూవీ తెరకెక్కింది. ఈ సినిమా మొత్తం లండన్ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది.
దయ్యాలు వెంటాడితే...
నికితా రాయ్ ఓ రచయిత. స్వతంత్ర భావాలు కలిగిన ఓ ధైర్యవంతురాలైన యువతి. నికిత సోదరుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. అతడి చావుకు ఓ మిస్టరీ బుక్‌కు సంబంధం ఉందని నికిత భావిస్తుంది. ఆ మిస్టరీ బుక్‌ను ఓపెన్ చేస్తుంది. అప్పటి నుంచి కొన్ని అదృశ్య ఆత్మలు నికితను వెంటాడటం మొదలుపెడతాయి. ఆ ఆత్మలు ఎవరిని? ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి నికితకు సాయం చేసిన అమర్ దేవ్ ఎవరు అన్నదే ఈ మూవీ కథ.సోనాక్షి సిన్హా గత ఏడాది తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. జటాధర అనే హారర్ మూవీలో కనిపించింది. హారర్ కథాంశంతో రూపొందిన ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటించాడు.ఈ సినిమా కూడా డిజాస్టర్‌గా నిలిచింది.
సంబంధిత వార్తలు

Sonakshi Sinha | భార్య హీరోయిన్ – భర్త విలన్ – పెళ్లి తర్వాత సోనాక్షి సిన్హా రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ
అక్టోబర్ 6, 2026

Vaishnavi Chaitanya | ఓటీటీలోకి వైష్ణవి చైతన్య రొమాంటిక్ మూవీ – లిప్‌లాక్‌లు, బోల్డ్ సీన్లతో జెన్‌జీ లవ్‌స్టోరీ
అక్టోబర్ 3, 2026

Malayalam OTT | 25 కోట్ల బడ్జెట్ – 325 కోట్ల కలెక్షన్స్ – ఓటీటీలోకి మమితాబైజు మలయాళ రొమాంటిక్ కామెడీ మూవీ
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం
- ●ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్
- ●Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!
- ●Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!
- ●Jio Platforms IPO | జియో ఐపీఓ విలువ రూ.11 లక్షల కోట్లు.. అతిపెద్ద లిస్టింగ్‌కు రెడీ..
- ●Singer Chinmayi | తెలుగు ఓటీటీ షోలో కంటెస్టెంట్‌గా సింగర్ చిన్మయి - బిగ్‌బాస్ కంటే డబుల్ ప్రైజ్‌మనీ

Bhatti Vikramarka | 27 లక్షల మంది విద్యార్థులకు వేడి వేడి అల్పాహారం

ACB Raids | ఏసీబీకి చిక్కిన సీనియర్ అకౌంటెంట్

Mumbai Ahmedabad Bullet Train | బుల్లెట్ రైలు ప్రాజెక్టులో బిగ్ ట్విస్ట్: జపాన్‌తో సిగ్నలింగ్ రగడ.. మేడ్ ఇన్ ఇండియా ట్రైన్‌తోనే తొలి జర్నీ!

Indian Navy | సముద్రంలో నేవీ సింహగర్జన!



