త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gandhi Talks OTT | ఓటీటీలోకి అదితీ రావ్ హైద‌రీ సైలెంట్ మూవీ – రిలీజ్ ఎప్పుడంటే?

విజ‌య్‌సేతుప‌తి, అదితీ రావ్ హైద‌రీ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన గాంధీ టాక్స్ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. ఒక్క డైలాగ్ లేకుండా సెలైంట్ మూవీగా తెర‌కెక్కిన ఈ సినిమా ఫిబ్ర‌వ‌రి 26 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Feb 9, 2026, 10.53 am IST

Gandhi Talks OTT | ఓటీటీలోకి అదితీ రావ్ హైద‌రీ సైలెంట్ మూవీ – రిలీజ్ ఎప్పుడంటే?
Advertisement

Gandhi Talks OTT | కోలీవుడ్‌లో కొత్త‌ద‌నానికి పెట్టింది పేరు విజ‌య్ సేతుప‌తి. స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా క‌థ‌, పాత్ర‌ల ప‌రంగా ప్ర‌యోగాలు చేస్తుంటారు. ఇటీవ‌లే గాంధీ టాక్స్ పేరుతో మూకీ మూవీ (డైలాగ్స్ లేకుండా) చేశారు విజ‌య్ సేతుప‌తి. డిఫ‌రెంట్ అటెంప్ట్‌గా గాంధీ టాక్స్ నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఫిబ్ర‌వ‌రి 26 నుంచి జీ5 ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

అదితీ రావ్ హైద‌రీ...

గాంధీ టాక్స్ మూవీలో విజ‌య్ సేతుప‌తితో పాటు ఆదితీ రావ్ హైద‌రీ, అర‌వింద్ స్వామి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. కిషోర్ పాండురంగ్ బ‌లేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాకు ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్ అందించారు.
ఒక్క డైలాగ్ లేకుండా సైలెంట్ మూవీగా రిలీజైన గాంధీ టాక్స్ క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. విజ‌య్ సేతుప‌తి, ఆదితీ రావ్ హైద‌రీ, అర‌వింద్ స్వామి యాక్టింగ్ మాత్రం బాగుంద‌నే కామెంట్స్ వినిపించాయి. ఏఆర్ రెహ‌మాన్ మ్యూజిక్‌తోనే ఈ సినిమాలోని ఎమోష‌న్స్‌ను చూపించిన తీరు బాగుంద‌ని ఆడియెన్స్ పేర్కొన్నారు.

విష్ణు...బోస్‌మ‌న్ జ‌ర్నీ...

మ‌హ‌దేవ్ విష్ణు (విజ‌య్ సేతుప‌తి) మురికివాడ‌లో నివ‌సిస్తుంటాడు. ముంబాయి మున్సిపాలిటీలో ఉద్యోగం వ‌స్తుంది. కానీ యాభై వేల లంచం అడుగుతారు. ఆ డ‌బ్బు కోసం ఓ క్రైమ్ చేయ‌డానికి విష్ణు రెడీ అవుతాడు. మ‌రోవైపు బోస్‌మెన్ (అర‌వింద్ స్వామి) పెద్ద బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. అనుకోకుండా వ్యాపారంలో న‌ష్టాలు రావ‌డంతో ఆస్తుల‌న్నీ కోల్పోతాడు. డ‌బ్బు కోసం బోస్‌మ‌న్‌ కూడా అడ్డ‌దారుల‌ను ఎంచుకుంటాడు. ఈ జ‌ర్నీలో విష్ణు, బోస్‌మ‌న్ ఎలా క‌లిశారు? విష్ణుకు గాయ‌త్రికి (అదితీరావ్ హైద‌రీ)కి ఉన్న సంబంధం ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement
Advertisement