Ishika Taneja | గ్లామర్ ప్రపంచం నుంచి ఆధ్యాత్మికత వైపు.. సాధ్విగా మారిన ఇషికా తనేజా..!
Entertainment | Published On Feb 3, 2026, 10.00 pm IST
Ishika Taneja | గ్లామర్ ప్రపంచంలో తన అందం, ప్రతిభతో ఒకప్పుడు సూపర్‌స్టార్‌లకు పోటీ ఇచ్చింది ఇషికా తనేజా. ఫ్యాషన్ షోలు, సినిమాలు, హై ప్రొఫైల్ సోషల్ లైఫ్‌ను పక్కన పెట్టి ఆధ్యాత్మిక జీవితంపై దృష్టి సారించింది. ఇకపై సనాతన ధర్మప్రచారమే తన లక్ష్యంగా నిర్దేశించుకుంది. గతేడాది ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళాలో పవిత్ర స్నానం చేసి ఆధ్యాత్మిక ప్రయాణంలో మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవల ద్వారకా శారదా పీఠం శంకరాచార్య సదానంద సరస్వతి మహారాజ్ నుంచి గురుమంత్ర దీక్ష తీసుకొని ‘సాధ్వి ఇషికా తనేజా’ కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ప్రస్తుతం ఇషికా తనేజా ‘శ్రీ మహాలక్ష్మి ఫౌండేషన్’ ఆధ్వర్యంలో మహిళల భద్రత, హిందూ సంస్కృతి పరిరక్షణకు సంబంధించి ‘మహాలక్ష్మి భారత్ అభియాన్’ తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
యువతను ధర్మ మార్గంలో నడిపిస్తూ, సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా ప్రసంగాలు అందిస్తున్నారు. ‘మనం సమాజంలోని అన్ని రంగాలను అష్టలక్ష్మి రూపాల ద్వారా అనుసంధానించాలనుకుంటున్నాం. గజలక్ష్మి మన మంత్రులకు, వీరలక్ష్మి సైన్యానికి, విజయలక్ష్మి న్యాయానికి, సంతానలక్ష్మి యువతకు, ఐశ్వర్యలక్ష్మి మీడియా, సోషల్ మీడియాకు ప్రతీకలు’ అని పేర్కొన్నారు. ఈ అన్ని వర్గాలను ధర్మంతో అనుసంధానించే ప్రయత్నంలో భాగంగానే ఎనిమిది రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని.. ఇందులో దేశ విదేశాల నుంచి ప్రతినిధులు పాలుపంచుకుంటున్నారని, మన సనాతన ధర్మంలోని గొప్పతనం వల్లే విదేశీయులు ఆకర్షితులవుతున్నారని తెలిపారు.
ఇషికా తనేజా 1994లో జన్మించి, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకున్నారు. 2017లో మిస్ ఇండియా టైటిల్, 2018లో మలేషియాలో మిస్సెస్ వరల్డ్ టూరిజంలో ‘బిజినెస్ వుమన్ ఆఫ్ ది వరల్డ్’ టైటిల్ సాధించారు. 2014లో 60 నిమిషాల్లో 60 మోడల్స్‌కు ఎయిర్‌బ్రష్ మేకప్ చేసి గిన్నిస్ రికార్డు సాధించారు. సినిమాల్లో, వెబ్ సిరీస్‌లలో నటించి, మహిళా సాధికారతకై చేసిన కృషికి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ‘100 వుమెన్స్ అచీవర్స్‌లో’ ఒకరిగా ఇషికా తనేజా గౌరవాన్ని అందుకున్నారు. ఆమె మధుర్ భండార్కర్ దర్శకత్వం వహించిన ‘ఇందు సర్కార్’ చిత్రంలోని ప్రమోషనల్ సాంగ్‌లో కనిపించింది. విక్రమ్ భట్ వెబ్ సిరీస్ ‘హద్’లో కీలక పాత్ర పోషించింది. గతంలో ఫ్యాషన్ ప్రపంచంలో వెలుగు వెలిగిన ఇషికా ప్రస్తుతం ఆధ్యాత్మిక జీవితం వైపు దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






