Dhurandhar 2 | ధురంధర్ 2 థియేటర్‌లో తెలుగు, హిందీ ఫ్యాన్స్ మధ్య గొడవ – వీడియో వైరల్
ధురంధర్ 2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో తెలుగు, హిందీ ఆడియెన్స్ మధ్య గొడవ జరిగింది. ఒకే స్క్రీన్‌కు సంబంధించిన ఒకే టైమ్‌లో తెలుగు, హిందీ వెర్షన్లకు టికెట్లు బుక్ కావడంతో ఏ భాషలో సినిమాను ప్రదర్శించాలనే విషయంలో వివాదం తలెత్తింది. చివరకు పోలీసుల ఎంట్రీ ఇవ్వాల్సివచ్చింది
Entertainment | Published On Mar 22, 2026, 7.01 pm IST
Dhurandhar 2 | ప్రస్తుతం దేశవ్యాప్తంగా ధురంధర్ 2 మూవీ హవా కొనసాగుతోంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాపై సినీ, రాజకీయ వర్గాలతో పాటు ఆడియెన్స్ ప్రశంసల వర్షాన్ని కురిపిస్తోన్నారు. కలెక్షన్ల పరంగా అదరగొడుతోంది. కాగా ధురంధర్ 2 సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. తెలుగు, హిందీ ఆడియెన్స మధ్య వాగ్వివాదం చోటుచేసుకోవడం పోలీసులు రంగప్రవేశం చేయాల్సివచ్చింది. హైదరాబాద్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది.
తెలుగు వర్సెస్ హిందీ...
హైదరాబాద్ పంజాగుట్టలో పీవీఆర్ నెక్స్ట్ గలెరియా మాల్‌లో ధురంధర్ 2 సినిమా చూసేందుకు పలువురు ఆడియెన్స్ బుక్ మై షో యాప్ ద్వారా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఒకే స్క్రీన్‌కు సంబంధించి ఒకే టైమ్‌లో తెలుగు, హిందీ వెర్షన్ల టికెట్లు బుక్కయ్యాయి. తెలుగుతో పాటు హిందీ వెర్షన్ బుక్ చేసుకున్నవారు థియేటర్‌కు వచ్చారు. పీవీఆర్ యాజమాన్యం మాత్రం హిందీ వెర్షన్ స్క్రీనింగ్ చేయడానికి రెడీ కాగా...తెలుగు టికెట్స్ బుక్ చేసుకున్నవారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాము ముందుగా టికెట్లను బుక్ చేసుకున్నాం కాబట్టి....తెలుగులోనే సినిమాను ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యంతో గొడవకు దిగారు. హిందీలో సినిమా చూడాలని వచ్చిన వారు అందుకు అంగీకరించలేదు. ఏ భాషలో సినిమాను స్క్రీనింగ్ చేయాలనే విషయంలో అయోమయం నెలకొంది. మరోవైపు ఓకే సీట్‌ను తెలుగు, హిందీ వెర్షన్స్ బుక్ చేసుకున్న ఇద్దరికీ కేటాయించారు. సీట్ల విషయంలో గొందరగోళం నెలకొంది. థియేటర్‌లోనే మెట్లపై కూర్చొని ప్రేక్షకులు నిరసనకు దిగారు. పరిస్థితి అదుపు తప్పడంతో యాజమాన్యం పోలీసులకు పిలిపించారు.
నెటిజన్ వీడియో...
పోలీసులు థియేటర్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఆడియెన్స్‌కు సర్ధిచెప్పారు. చివరకు థియేటర్‌లో హిందీ వెర్షన్‌ను స్క్రీనింగ్ చేశారు. తెలుగు టికెట్లు బుక్ చేసుకున్నవారు మాత్రం అసహనం వ్యక్తం చేశారు. థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఓ నెటిజన్ పెట్టిన వీడియోతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
500 కోట్లు...
కాగా ధురంధర్ 2 మూవీ మూడు రోజుల్లోనే ఐదు వందల కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణవీర్‌సింగ్, సారా అర్జున్ హీరోహీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, మాధవన్ కీలక పాత్రల్లో నటించారు.
View this post on Instagram
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్





