త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jacqueline Fernandez | అప్రూవ‌ర్‌గా మారేందుకు జాక్వెలిన్ రిక్వెస్ట్‌.. స‌మ‌యం కోరిన ఈడీ..!

Jacqueline Fernandez | రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో అప్రూవ‌ర్‌గా మారేందుకు బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఈడీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌స్తుతం ఈడీ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వ అప్రూవ‌ర్‌గా మారేందుకు అనుమ‌తించాల‌ని శ్రీ‌లంక‌న్ బ్యూటీ ఇటీవ‌ల కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.

P

Entertainment | Published On Apr 20, 2026, 4.22 pm IST

Jacqueline Fernandez | అప్రూవ‌ర్‌గా మారేందుకు జాక్వెలిన్ రిక్వెస్ట్‌.. స‌మ‌యం కోరిన ఈడీ..!
Advertisement

Jacqueline Fernandez | రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో అప్రూవ‌ర్‌గా మారేందుకు బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెస్ ఈడీకి ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఈ ద‌ర‌ఖాస్తు ప్ర‌స్తుతం ఈడీ ప‌రిశీల‌న‌లో ఉంది. ఇటీవ‌ల ప్ర‌భుత్వ అప్రూవ‌ర్‌గా మారేందుకు అనుమ‌తించాల‌ని శ్రీ‌లంక‌న్ బ్యూటీ ఇటీవ‌ల కోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేయ‌గా.. స్పంద‌న తెలిపేందుకు స‌మ‌యం కోరింది. ఈ కేసును సోమ‌వారం విచారించిన ప్ర‌త్యేక న్యాయ‌మూర్తి ప్ర‌శాంత్ శ‌ర్మ మే 8కి వాయిదా వేశారు.

జాక్వెలిన్ తరఫు న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 17న కోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్‌ను ఈడీ పలుమార్లు విచారించింది. ఈ కేసులో దాఖలైన సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో తొలిసారిగా నిందితురాలిగా చేర్చింది. గత ఏడాది జూలై 3న ఈ కేసుకు సంబంధించిన ఈసీఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు త‌లుపుత‌ట్ట‌గా.. జోక్యం చేసుకునేందుకు నిరాక‌రించింది.

కేసు వివ‌రాల్లోకి వెళితే.. ఆర్థిక నేర‌గాడు సుఖేశ్ చంద్ర‌శేఖ‌ర్ ర్యాన్‌బాక్సీ మాజీ ప్ర‌మోట‌ర్లు శివింద‌ర్ సింగ్‌, మ‌ల్వింద‌ర్ సింగ్ స‌తీమ‌ణుల‌ను రూ.200కోట్ల వ‌ర‌కు మోసం చేసిన‌ట్లుగా ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో సుకేశ్‌తో పాటు అత‌ని భార్య లీనా పౌలోస్‌ను అరెస్టు చేశారు. మ‌హారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గ‌నైజ్డ్ క్రైమ్ యాక్ట్ (మోకోకా) కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా నిందితులు షెల్ కంపెనీలను సృష్టించి, హవాలా మార్గంలో సొత్తును అక్ర‌మంగా కూడ‌బెట్టిన‌ట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ కేసుతో పాటు దేశ‌వ్యాప్తంగా ప‌లు కేసుల్లో సుకేశ్ చంద్ర‌శేఖ‌ర్‌పై ఆరోప‌ణ‌లున్నాయి.

Advertisement
Advertisement