Deepika Padukone | ధురంధర్-2 మౌనంపై ట్రోల్స్.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన దీపికా పదుకొణే..!
Deepika Padukone | రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటికే వెయ్యికోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి దీపికా పదుకొణె ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కొందరు నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే, తాజాగా దీపిక ఈ విమర్శలకు ముగింపు పలికింది.
Entertainment | Published On Apr 8, 2026, 10.20 am IST
Deepika Padukone | రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నది. ఇప్పటికే వెయ్యికోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే, ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి దీపికా పదుకొణె ఎలాంటి కామెంట్స్ చేయకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో కొందరు నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు. అయితే, తాజాగా దీపిక ఈ విమర్శలకు ముగింపు పలికింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఓ రీల్‌కు స్పందిస్తూ ఆమె స్పష్టత ఇచ్చింది. ఆ రీల్‌లో “రూ.500 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రానికి దీపిక ‘సైలెంట్ ట్రీట్‌మెంట్’ ఇచ్చిందా? ప్రీమియర్‌కు హాజరుకాకుండా కుటుంబంతో కలిసి సితార్ కచేరీకి వెళ్లింది. సోషల్ మీడియాలో ఒక్క పోస్టూ పెట్టలేదు. ఆమె దర్శకుడికి వ్యతిరేకంగా ఏదైనా ప్రకటన చేస్తోందా.. లేక సోషల్ మీడియా డ్రామా నుంచి దూరంగా ఉండటానికేనా?” అంటూ ప్రశ్నించారు. దీనికి దీపికా స్పందించింది.
మై ఫ్రెండ్ పీఎస్: మీ అందరికంటే ముందే నేను సినిమా చూసేశాను. మరి ఇప్పుడు ఎవరిపై జోక్ ? అంటూ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చింది. పలువురు అభిమానులు పెద్ద ఎత్తున దీపికకు మద్దతు ప్రకటించారు. “ప్రీమియర్‌లో ఆమె ఉంటే మొత్తం ఫోకస్ తనపైనే పడుతుంది. అందుకే దూరంగా ఉన్నారు” అంటూ కొందరు కామెంట్లు చేశారు. “ఆమె తన కుటుంబాన్ని చూసుకుంటున్నారు. ఆమెను ఒంటరిగా వదిలేయండి” అంటూ స్పందించారు. “భర్తకు మద్దతు అంటే సోషల్ మీడియాలో చూపించాల్సిన అవసరం లేదు” అంటూ మరికొందరు సమర్థించారు.
ఇక ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రణవీర్ సింగ్‌తో పాటు ఆర్ మాధవన్, సంజయ్ దత్, సారా అర్జున్, అర్జున్ రాంపాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ చిత్రం కరాచీలోని లియారి ప్రాంతం నేపథ్యంలో సాగుతుంది. గూఢచారి ఆపరేషన్లు, ఉగ్రవాద ఘటనల చుట్టూ కథ తిరుగుతుంది. సినిమా విడుదలకు ముందే పేడ్ ప్రీమియర్స్ ద్వారా రూ.75 కోట్లు వసూలు చేసింది. మూవీ విడుదలైన తొలిరోజే రూ.165 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.1600 కోట్లకుపైగా వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇదిలా ఉండగా.. దీపికా పదుకొనే సినిమాల విషయానికి వస్తే చివరిసారిగా సింఘం అగైన్ కనిపించింది. ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్‌తో కలిసి నటిస్తున్న ‘కింగ్’ చిత్రం డిసెంబర్ 2026లో విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సుహానా ఖాన్, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే అట్లీ దర్శకత్వంలో అల్లుఅర్జున్ సరసన నటిస్తున్న మరో భారీ ప్రాజెక్ట్‌లోనూ నటిస్తోంది.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



