త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ashu Reddy | చిక్కుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ అషురెడ్డి.. పెళ్లి చేసుకుంటానని రూ.9కోట్లు మోసం చేసిందంటూ కేసుపెట్టిన స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌..!

Ashu Reddy | పెళ్లి పేరుతో రూ.9.35 కోట్లు మోసం చేశారంటూ నటి అషు రెడ్డిపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. లండన్ ఇంజనీర్ ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

P

Entertainment | Published On Apr 26, 2026, 9.02 am IST

Ashu Reddy | చిక్కుల్లో బిగ్‌బాస్‌ బ్యూటీ అషురెడ్డి.. పెళ్లి చేసుకుంటానని రూ.9కోట్లు మోసం చేసిందంటూ కేసుపెట్టిన స్టాఫ్‌వేర్‌ ఇంజినీర్‌..!
Advertisement

Ashu Reddy | బిగ్‌బాస్‌ బ్యూటీ అషురెడ్డి చిక్కుల్లోపడింది. ఆమెపై హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. కోట్లాది రూపాయలు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. లండన్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ వైవీ ధర్మేంద ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ కేసు సర్వత్రా చర్చనీయాంవంగా మారింది. పోలీసులు వివరాల ప్రకారం.. షేక్‌పేట్‌కు చెందిన ధర్మేంద్ర 2018లో భారత్‌కు వచ్చిన సమయంలో అషురెడ్డితో పరిచయం ఏర్పడింది. తాను అమెరికాలో చదువుకున్నానని, సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్‌కు వచ్చానని ఆమె చెప్పినట్లు సమాచారం.

ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారి, పెళ్లి చేసుకుంటానని ఆమె నమ్మబలికిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత వివిధ అవసరాలు చూపిస్తూ ధర్మేంద్ర నుంచి పెద్ద మొత్తంలో నగదు, బంగారం తీసుకున్నట్లు ధర్మేంద్ర ఆరోపించారు. అంతేకాకుండా అతని డబ్బుతోనే ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించి, వాటిని తన పేరుమీదే రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక అషు రెడ్డి కుటుంబ సభ్యులు కూడా హడావుడి చేశారని, పెళ్లిపై నమ్మకం మరింత బలపడేలా ప్రవర్తించారని ఆయన ఫిర్యాదులో వివరించారు.

ఈ ఘటనపై ధర్మేంద్ర తండ్రి సత్యనారాయణ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2025 వరకు తన కుమారుడి నుంచి అషు రెడ్డి సుమారు రూ.9.35 కోట్లు, దాదాపు 5 కిలోల బంగారం తీసుకుంది. అలాగే పలు ఫ్లాట్లు, వాహనాలు కొనుగోలు చేయించింది. ఆమె సోదరి కూడా అదనంగా రూ.50 లక్షలు తీసుకుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా సీసీఎస్ పోలీసులు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం అషురెడ్డి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

Advertisement
Advertisement