త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajpal Yadav | జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్ యాద‌వ్ – స‌ల్మాన్ ఖాన్‌కు థాంక్స్‌

చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ క‌మెడియ‌న్ రాజ్‌పాల్ యాద‌వ్ జైలు నుంచి రిలీజ‌య్యారు. శ‌నివారం ఈ బాలీవుడ్ క‌మెడియ‌న్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్ యాద‌వ్..... స‌ల్మాన్ ఖాన్‌కు కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు.

N

Entertainment | Published On Feb 14, 2026, 8.45 pm IST

Rajpal Yadav | జైలు నుంచి రిలీజైన రాజ్‌పాల్ యాద‌వ్ – స‌ల్మాన్ ఖాన్‌కు థాంక్స్‌
Advertisement

Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ న‌టుడు రాజ్‌పాల్ యాద‌వ్ జైలు నుంచి విడుద‌ల‌య్యాయి. శ‌నివారం కోర్టు రాజ్‌పాల్ యాద‌వ్‌కు బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి విడుద‌లైన రాజ్‌పాల్ యాద‌వ్ బాలీవుడ్ అగ్ర న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌ష్ట స‌మ‌యంలో ఓ సోద‌రుడిగా స‌ల్మాన్ త‌న‌కు అండ‌గా నిలిచార‌ని అన్నాడు. స‌ల్మాన్ లాంటి మంచి మ‌న‌సున్న వ్య‌క్తులు ఇండ‌స్ట్రీలో చాలా అరుదుగా ఉంటార‌ని రాజ్‌పాల్ యాద‌వ్ పేర్కొన్నారు. ఈ బాలీవుడ్ క‌మెడియ‌న్ కామెంట్లు వైర‌ల్ అవుతోన్నాయి. బెయిల్ పిటిష‌న్ రిజెక్ట్ కావ‌డం, ఆదివారం సెల‌వు ఉండ‌టంతో రాజ్‌పాల్ యాద‌వ్ విడుద‌ల‌పై అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. కానీ అనూహ్యంగా ఢిల్లీ కోర్టు శ‌నివారం ఆయ‌న‌కు బెయిల్‌ను మంజూరు చేసింది.

స‌ల్మాన్ సాయం...

జైలు నుంచి విడుద‌లైన రాజ్‌పాల్ యాద‌వ్ చెక్ బౌన్స్ కేసు నుంచి త్వ‌ర‌లోనే బ‌య‌ట‌ప‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బాలీవుడ్ క‌మెడియ‌న్‌కు స‌ల్మాన్ ఖాన్ భారీగా ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌ల్మాన్ ఖాన్‌తో పాటు అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, వ‌రుణ్ ధావ‌న్ స‌హా ప‌లువురు బాలీవుడ్ సెలిబ్రిటీలు కూడా రాజ్‌పాల్ యాద‌వ్‌కు హెల్ప్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

తొమ్మిది కోట్లు...

అతా ప‌తా ల‌ప‌తా పేరుతో 2012లో తానే ద‌ర్శ‌క‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తూ ఓ సినిమాను రూపొందించారు రాజ్‌పాల్ యాద‌వ్‌. ఇందులో హీరోగా న‌టించాడు. సెటైరిక‌ల్ కామెడీగా రూపొందిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. 15 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా న‌ల‌భై ల‌క్ష‌ల లోపే వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ఈ సినిమా కోసం ఢిల్లీకి చెందిన ఫైనాన్షియ‌ర్ నుంచి రాజ్‌పాల్ యాద‌వ్ ఐదు కోట్ల ఫైనాన్స్ తీసుకున్నారు. సినిమాలో న‌ష్టాలు రావ‌డంతో ఆ అప్పు తీర్చ‌లేక‌పోయారు. ఫైనాన్షియ‌ర్‌కు రాజ్‌పాల్ యాద‌వ్ ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావ‌డంతో ఫైనాన్షియ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. 2018 లో కోర్టు రాజ్‌పాల్ యాద‌వ్‌కు ఆరు నెల‌ల జైలు శిక్ష‌ను విధించింది. కోర్టు అనుమ‌తితో ఇన్నాళ్లు గ‌డువు పొడిగిస్తూ అప్పును తీర్చేందుకు రాజ్‌పాల్ యాద‌వ్ చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు. అవేవీ ఫ‌లించ‌లేదు. దాంతో ఫిబ్ర‌వ‌రి 5వ తేదీన తీహార్ జైలులో లొంగిపోయారు. త‌న‌కు ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని, ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎవ‌రూ స్నేహితులు లేరంటూ జైలుకు వెళ్లేముందు రాజ్‌పాల్ యాద‌వ్ చేసిన కామెంట్లు వైర‌ల్ అయ్యాయి.

Advertisement
Advertisement