త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bollywood | బాలీవుడ్‌లో కథానాయికల కొరత..? స్టార్‌కిడ్స్‌పైనే భవిష్యత్తు ఆశలు..!

Bollywood | బాలీవుడ్ ప్ర‌స్తుతం ఓ కీల‌క ద‌శ‌లో ఉన్న‌ది. గ‌తంలో క‌థానాయిక‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన ఇండ‌స్ట్రీలో కొర‌త క‌నిపిస్తున్న‌ది. భారీ సినిమాల‌కు హీరోయిన్లు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ ఆశ‌ల‌న్నీ న‌వ‌త‌రంపై.. ముఖ్యంగా స్టార్‌కిడ్స్‌పై అదృష్టి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే కొంద‌రు అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నా గ‌తంలో ఉన్నంత స్థిర‌త్వం, స్టార్ ప‌వ‌ర్ క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌.

P

Entertainment | Published On Feb 18, 2026, 7.48 pm IST

Bollywood | బాలీవుడ్‌లో కథానాయికల కొరత..? స్టార్‌కిడ్స్‌పైనే భవిష్యత్తు ఆశలు..!
Advertisement

Bollywood | బాలీవుడ్ ప్ర‌స్తుతం ఓ కీల‌క ద‌శ‌లో ఉన్న‌ది. గ‌తంలో క‌థానాయిక‌ల‌తో క‌ళ‌క‌ళ‌లాడిన ఇండ‌స్ట్రీలో కొర‌త క‌నిపిస్తున్న‌ది. భారీ సినిమాల‌కు హీరోయిన్లు దొర‌క‌డం క‌ష్టంగా మారింది. ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ ఆశ‌ల‌న్నీ న‌వ‌త‌రంపై.. ముఖ్యంగా స్టార్‌కిడ్స్‌పై అదృష్టి నెల‌కొన్న‌ది. ఇప్ప‌టికే కొంద‌రు అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటున్నా గ‌తంలో ఉన్నంత స్థిర‌త్వం, స్టార్ ప‌వ‌ర్ క‌నిపించ‌డం లేద‌న్న‌ది ఇండ‌స్ట్రీ వ‌ర్గాల మాట‌.

2005 నుంచి 2015 మ‌ధ్య కాలంలో బాలీవుడ్‌కు స్వ‌ర్ణ‌యుగంలా సాగింది. ఆ సమయంలో బ‌డ్జెట్ సినిమాల‌కు కావాల్సిన ప్ర‌భావ‌వంత‌మైన క‌థానాయిక‌లు పెద్ద సంఖ్య‌లో అందుబాటులో ఉండేవారు. క‌రీనా క‌పూర్‌, ఖాన్‌, దీపికా పదుకొణె, ప్రియాంక చోప్రా, కత్రినా కైఫ్‌, రాణీ ముఖర్జీ, అనుష్క శర్మ, విద్యా బాలన్‌, కంగనా రనౌత్ వంటి హీరోయిన్లు ఎంద‌రో ఇండ‌స్ట్రీని శాసించారు.

Sara Ali Khan

సినిమాలో వారు ఉంటే చాలు ఆ చిత్రానికి మార్కెట్ విలువ పెరిగేది. కానీ, కరోనా మహమ్మారి తర్వాత పరిస్థితులు పూర్తిగా మారాయి. అప్పటి అగ్ర కథానాయికల్లో చాలామంది పెళ్లిళ్లు చేసుకొని సినిమాల‌కు దూర‌మ‌య్యారు. ఎంపిక ప్రాజెక్టుల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. అదే స్థాయిలో ప్ర‌భావం చూపించే క‌థానాయిక‌లు లేరంటే ద‌ర్శ‌కులు, హీరోలు బ‌హిరంగంగానే అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. గత పదేళ్లలో కొందరు కొంద‌రు ఇండ‌స్ట్రీకి వ‌చ్చారు.

ప‌లువురు త‌మ స్థానాన్ని ప‌దిలం చేసుకున్నారు. అలియా భట్‌, కృతి సనన్‌ స్థిరంగా సినిమాలు చేస్తుండగా.. శ్రద్ధా కపూర్ ప‌రిమిత చిత్రాల‌తోనే ముందుకు సాగుతున్న‌ది. కియారా అద్వానీకి ఇప్ప‌టి వ‌ర‌కు హిట్ ద‌క్క‌లేదు. ఇక యామీ గౌత‌మ్ త‌న‌దైన ఫంథాలో సినిమాలు ఎంచుకుంటూ వెళ్తున్న‌ది. సౌత్ నుంచి ర‌ష్మిక మంద‌న్నా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ప‌లు చిత్రాల్లో న‌టించింది. అయితే, వీరిలో చాలామంది కూడా మరో ఐదేళ్ల తర్వాత సీనియ‌ర్ హీరోయిన్ల త‌ర‌హాలో ఎంపిక చేసిన సినిమాల‌కు ప‌రిమిత‌మ‌య్యే అవ‌కాశం ఉంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో కొత్త ముఖాల కోసం అన్వేషిస్తున్నారు. ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చినా స్టార్ కిడ్స్‌పై బాలీవుడ్ ఆశ‌లు పెట్టుకుంది. అనన్య పాండే ఇప్పటివరకు ఈ గ్రూప్‌లో కొంత ముందంజలో ఉంది. ఆమె నటించిన కొన్ని చిత్రాలకు రెస్పాన్ వ‌చ్చింది. రాబోయే చాంద్ మేరా దిల్‌పై అంచ‌నాలు ఉన్నాయి. జాన్వీ క‌పూర్ వ‌రుస‌గా సినిమాలు చేస్తూ కెరీర్‌ను బ‌లోపేతం చేసుకునే ప్ర‌య‌త్నంలో ఉంది. సారా అలీఖాన్ ఇటీవ‌ల మెట్రో ఇన్ డినో లో ఎన్‌సెంబుల్ పాత్ర‌లో క‌నిపించ‌గా.. ‘పతి పత్నీ ఔర్ వో దోనో’పై దృష్టి సారించింది.

శనయా కపూర్‌కు తొలి ప్రయత్నం ఆశించిన ఫలితం ఇవ్వకపోయినా.. ‘తూ యా మైన్’తో కొత్తగా నిలదొక్కుకునే అవకాశం ఉంది. ఇక షారుక్ ఖాన్ త‌న‌య సుహానా ఖాన్ నిరాశ‌కు ఎదురైంది. ఇక ‘కింగ్’పై భారీ స్థాయి లాంచ్‌ కోసం సిద్ధమవుతోంది. మొత్తంగా బాలీవుడ్‌కు 2026 కీల‌కమ‌ని ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు. యువ కథ‌నాయిక‌లు ఎంత వ‌ర‌కు స‌ద్వినియోగం చేసుకుంటార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇదే రాబోయే బాలీవుడ్ క‌థానాయిక‌ల దిశ‌ను నిర్ణ‌యిస్తుంద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర‌గాలు పేర్కొంటున్నాయి.

Advertisement
Advertisement