Bhagyashri Borse | రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో మూవీ.. లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీకి ఛాన్స్..!
Bhagyashri Borse | ‘లెనిన్’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Sep 2, 2026, 3.10 pm IST
Bhagyashri Borse | ‘లెనిన్’తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన భాగ్యశ్రీ బోర్సేకు ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కనుందా? అంటే అవుననే సమాధానం వస్తుంది. రామ్‌చరణ్, సుకుమార్ కాంబోలో తెరకెక్కనున్న చిత్రంలో కథానాయికగా భాగ్యశ్రీ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. చరణ్‌కు జోడీగా ఆమెను తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు తెలుస్తోంది. ‘లెనిన్’ మూవీతో భాగ్యశ్రీ హిట్ కొట్టింది. ఈ మూవీ సక్సెస్‌తో వరుస అవకాశాలు వస్తాయని అభిమానులు భావించారు. కానీ ఇప్పటివరకు ఆమె కొత్త చిత్రాలేవీ ప్రకటించలేదు. దీనికి కారణం కథల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నట్లుగా సినీ వర్గాల్లో చర్చ సాగుతున్నది. పాత్రకు ప్రాధాన్యం ఉండటంతో పాటు కథలోనూ తన పాత్రకు బలమైన స్థానం ఉన్న చిత్రాలనే ఎంచుకోవాలని భాగ్యశ్రీ భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే వచ్చిన ప్రతి అవకాశానికీ ఓకే చెప్పకుండా, మంచి కథ కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇక చరణ్-సుకుమార్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఈ ఇద్దరి కాంబోలో రానున్న చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇలాంటి ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీకి అవకాశం వస్తే.. ఆమె కెరీర్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. అయితే, ఈ ప్రాజెక్టులో భాగ్యశ్రీని తీసుకున్నట్లుగా ఇప్పటి వరకు మేకర్స్ ప్రకటించలేదు. ఈ ప్రాజెక్ట్ విషయంలో గతంలో పలువురు కథానాయికల పేర్లు వినిపించాయి. తాజాగా భాగ్యశ్రీ పేరు తెరపైకి వచ్చింది. చరణ్ సరసన ఎవరు నటిస్తారన్న ఆసక్తి నెలకొంది. ఇక భాగ్యశ్రీ ప్రస్తుతం తమిళంలోకి ఎంట్రీ ఇస్తోంది. సియాన్ మూవీలో నటిస్తోంది. శివ కార్తికేయన్ సరసన కనిపించనుంది. ఈ చిత్రాన్ని లెజెండరీ నటుడు కమల్ హాసన్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన 'రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్' పతాకంపై నిర్మిస్తుండడం విశేషం. అమరన్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత కమల్ హాసన్, శివ కార్తికేయన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో మూవీ ఇది. ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.
తాజావార్తలు
- ●KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
- ●Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్
- ●KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు
- ●Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్
- ●Mega Job Mela | సెప్టెంబర్ 19న కోదాడలో మెగా జాబ్ మేళా.. 4 వేల మంది ఉద్యోగవకాశాలు
- ●Vinayaka Chavithi | వినాయకుడి పంచరత్నాలు.. పఠిస్తే ప్రశాంతత.. స్మరిస్తే విఘ్నవినాశనం

KCR | వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

Hyderabad | పల్టీలు కొట్టిన ఇన్నోవా క్రిస్టా.. ఇంటర్ స్టూడెంట్ స్పాట్ డెడ్

KTR | కేటీఆర్ పీఏ, పీఆర్వోకు పోలీసుల నోటీసులు

Telangana Bar Council | తెలంగాణ బార్ కౌన్సిల్ చైర్మన్‌గా సాముల రామ్ రెడ్డి, బీసీఐ సభ్యుడిగా కిరణ్ కుమార్






