Bala Krishna | సినిమాల కలెక్షన్స్ 70 శాతం ఆంధ్రా నుంచే వస్తున్నాయి – బాలకృష్ణ కామెంట్స్
కొత్తగా రిలీజ్ అవుతోన్న సినిమాల్లో అరవై నుంచి డెబ్బై శాతం వరకు కలెక్షన్స్ ఏపీ నుంచే వస్తున్నాయని బాలకృష్ణ అన్నారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, హీరోలు ఎక్కువగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీని బతికించాలని అన్నారు.
Entertainment | Published On May 24, 2026, 7.12 pm IST
Bala Krishna | టెక్నిక్ లేని రోజుల్లో సినిమాలు త్వరగా పూర్తయ్యేవని హీరో బాలకృష్ణ అన్నారు. ఆధునిక సాంకేతిక పెరిగిన తర్వాత సినిమాల నిర్మాణం చాలా ఆలస్యమవుతుందని చెప్పారు. సినిమాలు లేక ఎగ్జిబిటర్లు థియేటర్లకు తాళాలు వేయడం చూస్తుంటే బాధ కలుగుతుందని అన్నారు. ఏపీ ఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా భరత్‌భూషన్, వైస్ ఛైర్మన్‌గా మెహర్ రమేష్ ఆదివారం ప్రమాణం స్వీకారం చేశారు. ఈ వేడుకలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాలీవుడ్‌పై బాలకృష్ణ ఆసక్తికర కామెంట్లు చేశారు.
బతికితే చాలు...
"సినిమాలు ఎలా ఉంటున్నాయన్నది ఆలోచించాల్సింది పోయి సినీ పరిశ్రమ బతికితే చాలు అనుకునే పరిస్థితి వచ్చింది. హీరోలు ఎక్కువ సినిమాలు చేయాలి. అందులోనూ సందేశాత్మక కథలతో కూడిన మంచి సినిమాలను ప్రేక్షకులను అందించాలి. కష్టాల్లో ఉన్న సినీ పరిశ్రమను ఐక్యంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కొత్తగా రిలీజ్ అవుతోన్న ప్రతి సినిమాకు 60 నుంచి 70 శాతం కలెక్షన్లు ఆంధ్ర రాష్ట్రం నుంచే వస్తున్నాయి. రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి సినిమాల కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు" అని బాలకృష్ణ అన్నారు.
నంది పురస్కారాలు...
"నాన్నగారి హయాం నుంచి సినీ పరిశ్రమకు ఏపీలో విజయవాడ, వైజాగ్ రాజధానులుగా భాసిల్లుతున్నాయి. ఏపీలో చాలా చాలా షూటింగ్‌లు జరుగుతున్నాయి. నా సినిమా అఖండ 2 చిత్రీకరణ చాలా వరకు ఏపీలో జరిగింది. సినిమా షూటింగ్‌లకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసుకోవడమే కాకుండా చలన చిత్ర పరిశ్రమను ఆదుకోవడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తమ సహాయసహకారాలు అందించాలి. నిలిచిపోయిన నందితో పాటు మిగిలిన సినీ పురస్కారాలను తిరిగి ప్రారంభించే ఆలోచనలో ఉన్నాం" అని బాలకృష్ణ అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..
- ●India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో
- ●CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్
- ●MLA Rajagopal Reddy | రైతన్నలూ.. క్షమించండి.. పది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి
- ●Indian Origin Woman | అమెరికా స్టోర్‌లో భారతీయ మహిళ దారుణ హత్య.. కాల్చి చంపిన దుండగుడు
- ●Harbeer Singh | డ్రగ్స్ రాకెట్లో పంజాబీ సింగర్.. హర్బీర్ సింగ్ సోహైల్‌ను అరెస్టు చేసిన పోలీసులు..!

Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

India-Pakistan Border | విద్యుత్‌దీపాలతో వెలుగులీనుతున్న ఇండోపాక్ బోర్డర్.. ఆకట్టుకుంటున్న వీడియో

CP Sajjanar | బక్రీద్ వేళ నకిలీ యాప్‌లతో మోసాలు.. వ్యాపారులను హెచ్చరించిన సీపీ సజ్జనార్

MLA Rajagopal Reddy | రైతన్నలూ.. క్షమించండి.. పది రోజుల్లో మొత్తం ధాన్యం కొంటాం: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి





