త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ayesha Khan | అది నేను కాదు..! ఫేక్ అకౌంట్స్‌పై అప్ర‌మ‌త్తం చేసిన ధురంధ‌ర్ బ్యూటీ ఆయేషా ఖాన్‌..!

Ayesha Khan | ‘ధురంధర్’ మూవీతో గుర్తింపు పొందిన నటి ఆయేషా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన పేరుతో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలపై అభిమానులను అప్రమత్తం చేసింది. ఆయేషా ఖాన్ పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురికి సందేశాలు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

P

Entertainment | Published On Feb 21, 2026, 5.12 pm IST

Ayesha Khan | అది నేను కాదు..! ఫేక్ అకౌంట్స్‌పై అప్ర‌మ‌త్తం చేసిన ధురంధ‌ర్ బ్యూటీ ఆయేషా ఖాన్‌..!
Advertisement

Ayesha Khan | ‘ధురంధర్’ మూవీతో గుర్తింపు పొందిన నటి ఆయేషా ఖాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన పేరుతో జరుగుతున్న మోసపూరిత కార్యకలాపాలపై అభిమానులను అప్రమత్తం చేసింది. ఆయేషా ఖాన్ పేరుతో ఓ వ్యక్తి వాట్సాప్‌లో నకిలీ ప్రొఫైల్ సృష్టించి పలువురికి సందేశాలు పంపుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. తన ఫొటోలు, వ్యక్తిగత వివరాలను ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడుతున్న విషయం ఆమె దృష్టికి రావడంతో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ఈ సందర్భంగా వాట్సాప్ చాట్ స్క్రీన్‌షాట్లు, సంబంధిత ఫోన్ నంబర్‌ను షేర్ చేసింది. ఆ అకౌంట్ తనది కాదని స్పష్టం చేస్తూ, ఆ నంబర్ల నుంచి వచ్చే సందేశాలకు స్పందించవద్దని అభిమానులను కోరింది. ఎవరైనా తన పేరుతో సంప్రదిస్తే జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

సెలబ్రిటీల పేర్లతో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించడం ఇదే తొలిసారి కాదు. గతంలో సీనియర్ హీరోయిన్ Shriya Saran పేరుతో కూడా ఫేక్ ప్రొఫైల్స్ వెలుగులోకి వచ్చాయి. తన పేరును ఉపయోగిస్తూ ఎవరో వ్యక్తి సందేశాలు పంపుతున్నట్లు ఆమె అప్పట్లో వెల్లడించింది. అది తన నంబర్ కాదని స్పష్టం చేస్తూ, ఇతరులను మోసం చేయవద్దని హెచ్చరించింది. తాను గౌరవించే, కలిసి పని చేయాలనుకునే వారికి సైతం సందేశాలు పంపుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా, ఆయేషా ఖాన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే ఇటీవల ‘ధురంధర్’ చిత్రంలోని ‘షరారత్’ పాటలో మెరిసింది. గతేడాది విడుదలైన ‘కిస్ కిస్కో ప్యార్ కరూన్ 2’ చిత్రంలో నటించింది. ఇందులో ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మకు జోడీగా కనిపించింది. ‘ధురంధర్’లో ఆమె చేసిన నృత్యానికి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఆయేషా ఖాన్ ‘భాగమ్ భాగ్ 2’ చిత్రంలో అవకాశం దక్కినట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువ‌డాల్సి ఉంది.

Advertisement
Advertisement