త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | రేపే నా పెళ్లి.. భోజనం చేసి వెళ్లండి..! ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ రెస్పాన్స్‌..!

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలకే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో తరచూ చర్చల్లో నిలుస్తుంటుంది. ఇటీవల కోలీవుడ్ నటుడు ధనుష్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని సోష‌ల్ మీడియాలో ప్రచారం జరిగింది.

P

Entertainment | Published On Feb 13, 2026, 11.40 am IST

Mrunal Thakur | రేపే నా పెళ్లి.. భోజనం చేసి వెళ్లండి..! ధనుష్‌తో పెళ్లి వార్తలపై మృణాల్ రెస్పాన్స్‌..!
Advertisement

Mrunal Thakur | మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సినిమాలకే కాకుండా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలతో తరచూ చర్చల్లో నిలుస్తుంటుంది. ఇటీవల కోలీవుడ్ నటుడు ధనుష్‌ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నారని సోష‌ల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఫిబ్రవరి 14న వీరి వివాహం జరగనున్నట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్త‌ల‌ను మృణాల్ ఇప్పటికే ఖండించింది. ధనుష్ తనకు సోదరుడిలాంటివాడని న‌టి స్పష్టం చేసింది. తాజాగా గలాటా ప్లస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి ఈ అంశంపై స్పందించింది.

త్వరలో పెళ్లి చేసుకునే యోచన ఉందా? అన్న ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ, ఫిబ్రవరి 14న పెళ్లి జరుగుతుందన్న వార్తలపై సెటైరిక‌ల్‌గా స్పందించింది. “ఫిబ్రవరి 14 అంటే ఫూల్స్ డే లా (ఏప్రిల్ 1) మారిపోతుందేమో అనిపిస్తోంది. ఈ వార్తలు ఎవరు ప్రారంభించారో తెలియదు. నన్ను కోట్ చేశారని చెబుతున్నారు కానీ నేను అలాంటి వ్యాఖ్యలు చేయలేదు” అని తెలిపింది. ఫిబ్ర‌వి 14న‌ మీ పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి కదా? అని గుర్తుచేయగా మృణాల్ సరదాగా స్పందించింది. “అయ్యో! ఇవాళే నా హల్దీ, రేపు సంగీత్.. తప్పకుండా భోజనం చేసి వెళ్లండి” అంటూ న‌వ్వేసింది.

పెళ్లి విషయమై ఇంట్లో చర్చలు జరుగుతున్నాయా? అని అడగగా ఆమె సరదాగా స్పందించింది. “ఒక అబ్బాయిని చూడాలని నేను నాన్నకు చెప్పాను. ఆయన నన్నే చూసుకోమన్నారు. అయితే బాధ్యత మాత్రం ఆయనకే అప్పగించాను” అంటూ నవ్వుతూ చెప్పింది. పెళ్లి గురించి మాట్లాడిన ఆమె కేవలం సమాజం కోసం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన తనకు లేదని స్పష్టం చేసింది. సరైన సమయం వచ్చినప్పుడు, మనసుకు నచ్చిన వ్యక్తి దొరికినప్పుడు మాత్రమే ఆ నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. ప్రేమ అద్భుతమైన భావన అని, ప్రతి ఒక్కరికీ అది అనుభవంలోకి రావాలని అభిప్రాయం వ్య‌క్తం చేసింది.

వాస్తవానికి ముంబయిలో జరిగిన ఒక కార్యక్రమంలో ధనుష్, మృణాల్ కలిసి కనిపించిన తర్వాతే వీరి మధ్య సాన్నిహిత్యంపై పుకార్లు మొదలయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియోలో మృణాల్ ధనుష్ చెవిలో మాట్లాడగా, ఆయన చిరునవ్వు చిందించిన దృశ్యాలు చర్చనీయాంశమయ్యాయి. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రత్యేక ప్రదర్శన కోసం ధనుష్ చెన్నై నుంచి ముంబయికి వచ్చినట్లు సమాచారం. అరుదుగా కనిపించే ధనుష్ ఈ కార్యక్రమానికి రావడం మరింత చర్చనీయాంశమైంది. ఇదిలా ఉండ‌గా.. మృణాల్ ప్రస్తుతం సిద్ధాంత్ చతుర్వేది సరసన నటించిన ‘దో దీవానే సెహర్ మే’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. అలాగే అడవి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీని ఏప్రిల్‌లో విడుద‌ల చేసేందుకు మేక‌ర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement