త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anaswara Rajan | టాలీవుడ్‌లో మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర జోరు..!

Anaswara Rajan | మలయాళ చిత్రసీమలో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కేరళ కుట్టి అనస్వర రాజన్‌ టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభ దశలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటి, తెలుగు ప్రేక్షకులకు ‘ఛాంపియన్’ సినిమాతో పరిచయమైంది.

P

Entertainment | Published On May 30, 2026, 6.30 pm IST

Anaswara Rajan | టాలీవుడ్‌లో మ‌ల‌యాళ బ్యూటీ అన‌స్వ‌ర జోరు..!
Advertisement

Anaswara Rajan | మలయాళ చిత్రసీమలో తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కేరళ కుట్టి అనస్వర రాజన్‌ టాలీవుడ్‌లోనూ తనదైన ముద్ర వేసే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. కెరీర్ ఆరంభ దశలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ నటి, తెలుగు ప్రేక్షకులకు ‘ఛాంపియన్’ సినిమాతో పరిచయమైంది. ఈ చిత్రంలో రోషన్‌ మేక సరసన నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఆ ఫలితాన్ని ఇండస్ట్రీలో పెద్దగా నెగటివ్‌గా చూడలేదు. ఎందుకంటే అనశ్వర నటనపై వచ్చిన స్పందన మాత్రం వేరేలా ఉంది. ఆమె సహజమైన ఎక్స్‌ప్రెషన్స్, పాత్రలోకి సులభంగా ఒదిగిపోయే తీరు దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించాయి. సినిమా ఫలితం ఎలా ఉన్నా, ఆమెకు వచ్చిన ఫీడ్‌బ్యాక్ మాత్రం అవకాశాల రూపంలో కొనసాగుతోంది. అందుకే ఇప్పుడు ఆమె చేతిలో వరుసగా రెండు భిన్నమైన తెలుగు ప్రాజెక్టులు ఉన్నాయి.

అందులో మొదటిగా మాట్లాడుకుంటున్నది భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ‘మెగా 158’. ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు బాబీ కొల్లి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అనస్వర పాత్ర సాధారణ హీరోయిన్ రోల్ కాదు. ఆమెను చిరంజీవి కూతురి పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. ఇది కథలో భావోద్వేగానికి, అలాగే కీలక మలుపులకు కారణమయ్యే పాత్రగా ఉండనుందని ఫిల్మ్ నగర్‌లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఇలాంటి పాత్రలు స్క్రీన్ టైమ్ పరంగా చిన్నవిగా కనిపించినా, ప్రభావం మాత్రం ఎక్కువగా ఉంటుంది. అదే కోణంలో ఈ పాత్రను కూడా చూస్తున్నారు. మెగాస్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనస్వర కెరీర్‌కు పెద్ద బ్రేక్‌గా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు. ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌లో ఆమెకు ఇది కొత్త గుర్తింపును తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇక మరోవైపు, పూర్తిగా యూత్ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఇట్లు అర్జున’లో ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో కొత్త హీరో అనీష్‌కు జోడీగా అనస్వర కనిపించనుంది. అతని జీవితంలో ప్రేమను తీసుకువచ్చే, భావోద్వేగాలను మలిచే యువతి పాత్రలో ఆమె నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగిల్ ‘హాయ్ రే’ మంచి స్పందన తెచ్చుకుంది. పాట విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో రీల్స్, షేర్లు పెరగడంతో సినిమాపై ఒక రకమైన పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. పాట విజయంతో పాటు సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం అందించిన ఎస్‌ తమన్‌ ట్యూన్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఒకవైపు స్టార్ హీరో సినిమాలో భావోద్వేగభరితమైన కీలక పాత్ర, మరోవైపు యూత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసిన పూర్తి స్థాయి హీరోయిన్ రోల్‌తో అనస్వర రాజన్ టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ప్రయత్నాలు చేస్తోంది. కెరీర్ ప్రారంభ దశలోనే ఇలాంటి విభిన్న పాత్రలు దొరకడం ఆమెకు ప్లస్‌గా మారుతుందా లేదా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

Advertisement
Advertisement