లోడ్ అవుతోంది...

Pushpa 2 | జపాన్‌లో తెలుగు సినిమాలు అదరగొడుతోన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తో పాటు పలు ఇండియన్ సినిమాలు జపనీస్ భాషలో రిలీజై మంచి వసూళ్లను రాబట్టాయి. తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప 2 కూడా జపాన్‌లో విడుదల కాబోతుంది. పుష్ప కున్నిన్ పేరుతో జనవరి 16న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పుష్ప 2 ప్రమోషన్స్ కోసం బన్నీ తన ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి జపాన్ వెళ్లారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించారు. టోక్యో బ్యూటీఫుల్ సిటీ అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్‌కు జపనీస్ అభిమానులు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పుష్ప 2 జపాన్ ప్రమోషన్స్‌లో అల్లు అర్జున్‌తో పాటు సుకుమార్ కూడా పాల్గొననున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 250 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
పుష్ప 2 మూవీకి జపాన్ కనెక్షన్ ఉంది. జపాన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యాక్షన్ ఎపిసోడ్‌తోనే ఈ సినిమా మొదలవుతుంది. తెలుగు వెర్షన్‌లో బన్నీ కొన్ని జపనీస్ డైలాగ్స్ చెబుతున్నారు. అవన్నీ ఇప్పుడు జపాన్ ఆడియెన్స్‌ను మెప్పిస్తాయని మేకర్స్ చెబుతోన్నారు. జనవరి 15న ప్రీమియర్స్ వేయబోతున్నారు.
పుష్ప 2 మూవీ ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. 2024 డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీ 1800 కోట్ల కలెక్షన్స్ రాబట్టింద. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన మూడో మూవీగా నిలిచింది.ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ యాక్టింగ్, మ్యానరిజమ్స్‌తో పాటు సుకుమార్ టేకింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి. పుష్ప 2 మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. ఫహాద్ ఫాజిల్, జగపతిబాబు, రావురమేష్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో ఓ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్. దాదాపు 1500 కోట్ల బడ్జెట్‌తో సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam