త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sobhita Dhulipala | భార్య‌ వంట‌పై నాగ‌చైత‌న్య ఫ‌న్నీ ఫోస్ట్ – శోభిత క్యూట్ రిప్లై

భార్య శోభిత ధూళిపాళ‌ను స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు నాగ‌చైత‌న్య‌. పెళ్లి త‌ర్వాత త‌న కోసం ఫ‌స్ట్ టైమ్ వంట చేసిందంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు. అత‌డి పోస్ట్‌కు న‌న్ను ట్రోల్ చేస్తున్నావా? పొగుడుతున్నావా? అంటూ శోభిత రిప్లై ఇచ్చింది.

N

Entertainment | Published On Jul 25, 2026, 11.55 am IST

Sobhita Dhulipala | భార్య‌ వంట‌పై నాగ‌చైత‌న్య ఫ‌న్నీ ఫోస్ట్ – శోభిత క్యూట్ రిప్లై
Advertisement

Sobhita Dhulipala |  భార్య శోభిత ధూళిపాళ‌ను నాగ‌చైత‌న్య స‌ర‌దాగా ఆట‌ప‌ట్టించాడు. పెళ్లి త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ శోభిత త‌న కోసం వంట చేసిందంటూ సోష‌ల్ మీడియాలో ఓ ఫ‌న్నీ పోస్ట్ పెట్టాడు. 2024లో శోభిత‌తో ఏడ‌డుగులు వేశాడు నాగ‌చైత‌న్య‌. పెళ్లి త‌ర్వాత తెలుగు సినిమాల‌తో నాగ‌చైత‌న్య‌....త‌మిళ సినిమాల‌తో శోభిత బిజీ అయ్యారు. సోష‌ల్ మీడియాలో త‌మ కొత్త సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్ త‌ప్పితే ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యాలు షేర్ చేయ‌డం త‌క్కువే. అది కూడా భార్య‌తో క‌లిసి వెకేష‌న్‌కు వెళ్లిన ఫొటోలు అప్పుడ‌ప్పుడు నాగ‌చైత‌న్య‌ అభిమానుల‌తో పంచుకుంటుంటారు.

ఫ‌న్నీ పోస్ట్‌....

తాజాగా భార్య శోభిత‌ను ఆట‌ప‌ట్టించాడు. "పెళ్లైనా రెండేళ్ల త‌ర్వాత ఫ‌స్ట్ టైమ్ నా కోసం మా ఆవిడ వంట చేసింది. ఈ రోజు నేను ఏదో మంచి ప‌ని చేసుంటాను" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో నాగ‌చైత‌న్య  ఓ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌కు శోభిత‌ ఫొటోల‌ను జోడించాడు. అందులో కిచెన్ నుంచి తాను వండిన‌ వంట‌ల తాలూకు ప్లేట్స్ తీసుకొస్తూ శోభిత క‌నిపిస్తోంది.

క్యూట్ రిప్లై...

భ‌ర్త ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కు శోభిత కూడా రిప్లై ఇచ్చింది. మీరు న‌న్ను పొగుడుతున్నారా? ట్రోల్ చేస్తున్నారా? అంటూ అంతే స‌ర‌దాగా కామెంట్ పెట్టింది. వీరిద్ద‌రి మ‌ధ్య సాగిన సంభాష‌ణ నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. క్యూట్ క‌పుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

వృష‌క‌ర్మ‌....

ప్ర‌స్తుతం తెలుగులో వృష‌క‌ర్మ సినిమా చేస్తోన్నాడు నాగ‌చైత‌న్య‌. మిస్టిక్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీకి కార్తీక్ వ‌ర్మ దండు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మీనాక్షి చౌద‌రి హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ మూవీ త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. మ‌రోవైపు శోభిత త‌మిళంలో వెట్టువ‌మ్ అనే త‌మిళ సైంటిఫిక్ థ్రిల్ల‌ర్ మూవీలో న‌టిస్తోంది. ఈ సినిమాకు పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

https://www.instagram.com/p/DbLiLrizlG_/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==

 

Advertisement
Advertisement