Nayanthara | నాకు నయనతార కావాలి..! అన్నాడీఎంకే ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
Nayanthara | తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ భద్రత అంశంపై ఆ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రముఖ నటి నయనతారను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.
Entertainment | Published On Mar 17, 2026, 5.30 pm IST
Nayanthara | తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డీఎంకే ప్రభుత్వ హయాంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, క్షీణిస్తున్న శాంతిభద్రతలకు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. షణ్ముగం తన సొంత నియోజకవర్గమైన విల్లుపురం జిల్లాలో నిర్వహించిన కార్యక్రమంలో నటి నయనతారను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. సీఎం స్టాలిన్‌పై విమర్శలు చేయబోయి ఆయన చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డీఎంకే పార్టీ చీఫ్, సీఎం స్టాలిన్ మాట్లాడుతూ ప్రజలు తమ కోరికలను పంచుకోవాలని.. ప్రభుత్వం వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తుందని తెలిపారు.
నిరసన కార్యక్రమంలో అన్నాడీఎంకే ఎంపీ సీవీ షణ్ముగం మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నారని, స్టాలిన్ తమ కలలను చెప్పాలంటున్నారని, తాను నయనతార కావాలంటే.. స్టాలిన్ తన కోరికను తీరుస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎవరైనా వచ్చి నయనతారతో పెళ్లి జరిపించాలని అడిగితే చేస్తారా? అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అయితే, మహిళల భద్రత, గౌరవానికి కోసం పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో లైంగిక వేధింపుల తరహాలో అవమానకర వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన మాట్లాడుతున్న సమయంలో పక్కనున్న ఇతర నేతలు నవ్వుతూ స్పందించడం మరింత ఆగ్రహానికి కారణమైంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పలువురు ఎంపీ వ్యాఖ్యలపై మండిపడ్డారు.
మహిళల రక్షణ కోసం పోరాటాలు చేస్తామని మాట్లాడుతారని.. కానీ వేదికపై ఓ మహిళ గురించి అసభ్యంగా మాట్లాడడం వారి స్వభావాన్ని చూపిస్తోందంటూ గిరిధర్ అనే యూజర్ వ్యాఖ్యానించాడు. వనిత అనే నెటిజన్ స్పందిస్తూ పార్టీ నేతలు జయలలిత ఫొటోలను జేబులో పెట్టుకుంటారని.. కానీ మాట్లాడేవని అర్థం లేని మాటలేనని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు సైతం అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎంపీపై కేసు నమోదు చేయాలని, పార్టీ సైతం క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. ఏఐఏడీఎంకే ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయితే, పేరు చెప్పడానికి ఇష్టపడని ఆ పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించడం అధికార ప్రతినిధి పని కాదని, ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదన్నారు.
https://x.com/i/status/2033856812634849550
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Vijay TVK Cabinet | తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్: 59 ఏళ్ల తర్వాత మళ్లీ ప్రభుత్వంలోకి కాంగ్రెస్.. సీఎం విజయ్ క్యాబినెట్లో ఇద్దరికి ఛాన్స్
మే 20, 2026

SIR | అర్హులకు ఓటు హక్కు కల్పించడమే సర్ లక్ష్యం : కలెక్టర్ గరిమ అగ్రవాల్
మే 20, 2026

Murder Case | వరంగల్‌లో జంట హత్యల కేసు: నిందితుడికి మరణశిక్ష విధించిన కోర్టు..!
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



