Dacoit | అడవి శేష్ డెకాయిట్ ట్రైలర్ వచ్చేసింది..!
Dacoit | అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రత్యేకమైన కథలు, విభిన్న పాత్రలతో ముందుకు సాగుతున్నాడు. తాజాగా ‘డెకాయిట్’ తో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది.
Entertainment | Published On Apr 4, 2026, 7.15 pm IST
Dacoit | అడవి శేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రత్యేకమైన కథలు, విభిన్న పాత్రలతో ముందుకు సాగుతున్నాడు. తాజాగా ‘డెకాయిట్’ తో ప్రేక్షకులకు ముందుకు రానున్నాడు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. డెబ్యూ దర్శకుడు షనీల్ దేవ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అడివి శేష్ సరసన మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. కథ మొత్తం ప్రేమ, ద్రోహం, నేరాల మధ్య భావోద్వేగ ప్రయాణంగా సాగనుంది. సాధారణ జీవితం గడపాలని కోరుకున్న హరి, జూలియట్ జీవితంలో ఒక్కసారిగా జరిగిన సంఘటనలు అన్నింటినీ తారుమారు చేస్తాయి. అనుకోని పరిస్థితుల్లో హరి జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత, అనారోగ్యంతో బాధపడుతున్న తన కూతురిని కాపాడేందుకు జూలియట్ పెద్ద మొత్తంలో డబ్బు కోసం తపిస్తుంది.
ఈ నేపథ్యంలో ప్రేమికుడైన హరి ప్రమాదకరమైన నేర ప్రపంచంలోకి అడుగుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక సాధారణ యువకుడు ఎలా డెకాయిట్‌గా మారాడనేది కథలో కీలక అంశంగా నిలుస్తుంది. అడివి శేష్ రెండు విభిన్న కోణాల్లో కనిపిస్తూ తన నటనలో మరో కొత్త కోణాన్ని చూపించాడు. అమాయక ప్రేమికుడిగా.. పరిస్థితుల వల్ల నేరస్థుడిగా మారే పాత్రలో నటన ఆకట్టుకుంటోంది. మృణాల్ ఠాకూర్ జూలియట్ పాత్రలో భావోద్వేగాలను పలికించింది. ప్రేమికురాలిగా, తల్లిగా ఆమె చూపించిన నటన ప్రేక్షకులను కదిలించేలా ఉంది. ఇక అనురాగ్ కశ్యప్ పోలీస్ అధికారిగా గంభీరంగా కనిపించగా, ప్రకాశ్ రాజ్, సునీల్, అతుల్ కుల్కర్ణి కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



